Armed Forces : ‘అగ్నిపథ్’ వయోపరిమితి పెంపునకు సిఫారసు!
ABN, Publish Date - Jul 07 , 2024 | 03:49 AM
అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి.
న్యూఢిల్లీ, జూలై 6: అగ్నిపథ్ అభ్యర్థుల వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచాలని, నాలుగేళ్ల తర్వాత కనీసం 50% మందిని కొనసాగించాలని సాయుధ దళాలు కేంద్రానికి సిఫారసు చేయనున్నాయి. సైనికుల్లో పోరాట సామర్థ్యాలను పెంచే దిశగా ఈ మార్పులను సూచించాలని నిర్ణయించినట్లు సీనియర్ సైనిక అధికారులు వెల్లడించారు. గరిష్ఠ వయోపరిమితిని ప్రస్తుతం ఉన్న 21 ఏళ్ల నుంచి 23 ఏళ్లకు పెంచడం ద్వారా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన అభ్యర్థులు త్రివిధ దళాల్లో సాంకేతిక ఉద్యోగాలు పొందడానికి అవకాశాలు పెరుగుతాయన్నారు.
50% మందిని కొనసాగించడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో సిబ్బంది కొరతను అధిగమించవచ్చన్నారు. ప్రస్తుతం నాలుగేళ్ల తర్వాత కేవలం 25ు మంది అగ్నివీర్‌ల సర్వీసును మాత్రమే కొనసాగిస్తున్నారు. కాగా, ఆగ్రా వైమానిక కేంద్రం షాఘంజ్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో సర్వీస్ తుపాకీతో కాల్చుకొని ఓ అగ్నివీర్ బలవన్మరణానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు పాల్పడిన అగ్నివీర్.. శ్రీకాంత్ అని, యూపీలోని బలియా జిల్లా ఆయన స్వస్థలమని, 2022లో అగ్నివీర్ పథకం ద్వారా వైమానిక దళంలో చేరారని అధికారులు తెలిపారు.
Updated Date - Jul 07 , 2024 | 03:49 AM