Kejriwal Video: జైలు నుంచి విడుదలైన అరవింద్ కేజ్రీవాల్..
ABN, Publish Date - Sep 13 , 2024 | 06:40 PM
లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.
ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు. దాదాపు అయిదున్నర నెలలపాటు ఆయన జైలులో ఉన్నారు. ఎట్టకేలకు సుప్రీం కోర్టు(Supreme Court)లో శుక్రవారం ఆయనకు ఊరట లభించింది.
సీబీఐ,ఈడీ కేసుల్లో కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. కేజ్రీవాల్‌కు బెయిల్ వచ్చిందనే సంబరాల నడుమ.. ఆప్ నేతలు, కార్యకర్తలు తిహార్ జైలుకు భారీగా చేరుకున్నారు. ఆయన బయటకు రాగానే పూలదండలతో స్వాగతం పలికారు. స్వీట్లు పంచుకుని, టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.
సమన్ల నుంచి బెయిల్ వరకు
అక్టోబర్ 2023: మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తొలిసారి సమన్లు జారీ చేసిన ఈడీ.
నవంబర్ 2, 2023: ఈడీ సమన్లను పక్కన పెట్టి మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో ర్యాలీలో పాల్గొన్న సీఎం కేజ్రీవాల్.
డిసెంబర్ 2023: ఈడీ రెండోసారి సమన్లు జారీ చేసింది.
జనవరి 2024: మూడోసారి సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ
జనవరి 18, 2024: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ప్రశ్నించేందుకు తమ ఎదుట హాజరుకావాలంటూ ఈడీ వరుసగా నాలుగోసారి సీఎం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది.
ఫిబ్రవరి 02, 2024: ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఐదో సారి, ఆరవసారి జారీ చేసిన ఈడీ సమన్లను సైతం సీఎం కేజ్రీవాల్ విస్మరించారు. సమన్ల చట్టబద్దతపై తన న్యాయవాదులతో సంప్రదింపులు జరిపారు.
మార్చి 16, 2024: సెషన్స్ కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది.
మార్చి 21, 2024: ఈడీ సమన్లు జారీ చేయడంపై బలవంతపు చర్యల నుంచి రక్షణ కోసం కేజ్రీవాల్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.
మార్చి 21, 2024: ఇదే అంశంపై సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
మార్చి 21, 2024: తొమ్మిది సమన్లకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించలేదన్న ఈడీ. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది.
మే 10, 2024: లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారానికి అనుమతి ఇస్తూ.. సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 1వ తేదీ తిరిగి తిహార్ జైల్లో లొంగిపోవాలని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.
జూన్1, 2024: మధ్యంతర బెయిల్ కోసం ఢిల్లీ కోర్టును ఆశ్రయించిన సీఎం కేజ్రీవాల్
జూన్ 02, 2024: సుప్రీంకోర్డు ఉత్తర్వుల నేపథ్యంలో తిహార్ జైల్లో లొంగిపోయిన కేజ్రీవాల్
జూన్ 05, 2024: ఆరోగ్య కారణాల దృష్ట్యా సీఎంకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన రౌస్ ఎవెన్యూ కోర్టు
జూన్ 20, 2024: బెయిల్ మంజూరు చేసిన ఢిల్లీ కోర్టు.
జూన్ 21, 2024: కేజ్రీవాల్‌ను బెయిల్ ఇవ్వకూడదంటూ హైకోర్టును ఆశ్రయించిన ఈడీ
జూన్ 26, 2024: కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన సీబీఐ.
సెప్టెంబర్ 05, 2024: కేజ్రీవాల్ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ.. మద్యం కుంభకోణం కేసులో తనకు బెయిల్ ఇప్పించాలంటూ సీఎం కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ.. తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు.
సెప్టెంబర్ 13, 2024: కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు. తిహార్ జైలు నుంచి విడుదల
For Latest News and National News click here
Updated Date - Sep 13 , 2024 | 06:49 PM