ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharshta Elections: పోటీలో లేని ఆప్... 'ఇండియా' కూటమి అభ్యర్థులకు కేజ్రీవాల్ ప్రచారం

ABN, Publish Date - Oct 26 , 2024 | 05:31 PM

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో ప్రచారానికి రావాల్సిందిగా శివసేన-యూబీటీ, ఎన్‌సీపీ-ఎస్‌పీ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటీవల కోరారు. ఇందుకు సానుకూలంగా కేజ్రీవాల్ స్పందించారు. ఆప్‌ కార్యకర్తలు ఉన్న ప్రాంతాల్లోనూ, వివాద రహిత అభ్యర్థులు ఉన్న చోట్ల ప్రచారానికి ఆయన అంగీకరించారు.

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Maharashtra Assembly Elections) వేళ ''ఆమ్ ఆద్మీ పార్టీ'' (AAP) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో 'ఇండియా కూటమి' అభ్యర్థుల తరఫున ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రచారం చేయనున్నారు. ఆప్ కార్యకర్తలు ఉన్న చోట్ల, ఎలాంటి వివాదాలు లేనటువంటి ఎంవీఏ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్ర ఎన్నికలకు 'ఆప్' దూరంగా ఉండగా, మహా వికాస్ అఘాడి (MVA) తరఫున ప్రచారంలో కేజ్రీవాల్ పాల్గొంటారని పేర్కొన్నాయి.

Virendra Sachdeva: యమునా నదిలో స్నానం చేసి ఆసుపత్రి పాలైన బీజేపీ చీఫ్


పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, మహారాష్ట్రలో ప్రచారానికి రావాల్సిందిగా శివసేన-యూబీటీ, ఎన్‌సీపీ-ఎస్‌పీ నేతలు అరవింద్ కేజ్రీవాల్‌ను ఇటీవల కోరారు. ఇందుకు సానుకూలంగా కేజ్రీవాల్ స్పందించారు. ఆప్‌ కార్యకర్తలు ఉన్న ప్రాంతాల్లోనూ, వివాద రహిత అభ్యర్థులు ఉన్న చోట్ల ప్రచారానికి ఆయన అంగీకరించారు. కేజ్రీవాల్‌తో పాటు పలువురు ఆప్ సీనియర్ నేతలు కూడా మహా వికాస్ అఘాడి తరఫున ప్రచారంలో పాల్గొంటారు. 288 మంది సభ్యుల జార్ఖాండ్ అసెంబ్లీకి ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


జార్ఖాండ్‌లోనూ...

కాగా, అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న జార్ఖాండ్‌లోనూ కేజ్రీవాల్ ప్రచారం సాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇండియా కూటమికి మరింత బలం చేకూర్చే అర్బన్ సీట్లలో అరవింద్ కేజ్రీవాల్ ప్రచారం చేస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. జార్ఖాండ్‌లో బీజేపీ కూటమి, జేఎంఎం కూటమి మధ్య పోటీ ఉంది. బీజేపీలో జార్ఖాండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఏఐఎస్‌యూ), జనతాదళ్ (యూనైటెడ్), లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్‌జేపీ) భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. మరోవైపు జార్ఖాండ్ ముక్తి మోర్చా (జేఎంఎం)లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ), కాంగ్రెస్ భాగస్వాములుగా ఉన్నాయి. నవంబర్ 13, నవంబర్ 20 తేదీల్లో రెండు విడతలుగా జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడతాయి.


ఇవి కూడా చదవండి...

Rahul Gandhi: రాహుల్‌కు గడ్డం గీస్తూ.. బార్బర్ ఎలా వణికాడో చూడండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Oct 26 , 2024 | 05:34 PM