ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kejriwal: కేజ్రీవాల్‌ సీఎం పోస్ట్‌కు ముప్పు..? ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్

ABN, Publish Date - Mar 30 , 2024 | 10:37 AM

లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పోస్ట్‌కు ముప్పు పొంచి ఉంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలవడం, విచారణ జరిగిన సంగతి తెలిసిందే. జైలులో ఉండి పాలించే అంశంపై జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ముందుకు మరో పిటిషన్ వచ్చింది.

ఢిల్లీ: లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ముఖ్యమంత్రి పోస్ట్‌కు ముప్పు పొంచి ఉంది. ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలవడం, విచారణ జరిగిన సంగతి తెలిసిందే. జైలులో ఉండి పాలించే విషయంలో జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఢిల్లీ హైకోర్టు ముందుకు మరో పిటిషన్ వచ్చింది. హైకోర్టులో (High Court) హిందూసేన శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేసింది. అరవింద్ కేజ్రీవాల్‌ను (Arvind Kejriwal) సీఎం పోస్ట్ నుంచి తక్షణమే తప్పించాలని అందులో కోరింది.

Special buses: 17, 18 తేదీల్లో 2,000 ప్రత్యేక బస్సులు.. దేనికోసమంటే...

ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి అరవింద్ కేజ్రీవాల్‌ను తప్పించాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఆదేశాలు ఇవ్వాలని హిందు సేన తన ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పేర్కొంది. లెప్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం పాలనా వ్యవహారాలను చూడాలని సూచించింది. ఇదే అంశంపై దాఖలైన పిటిషన్‌ను గురువారం నాడు ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో న్యాయపరమైన జోక్యం అవసరం లేదని అభిప్రాయ పడింది. ఇంతలో మరో పిటిషన్ దాఖలు కావడం తీవ్ర కలకలం రేపుతోంది.

Special buses: 17, 18 తేదీల్లో 2,000 ప్రత్యేక బస్సులు.. దేనికోసమంటే...

ఓ ముఖ్యమంత్రి జ్యుడిషీయల్ కస్టడీ లేదంటే పోలీస్ కస్టడీలో ఉంటూ పరిపాలించే అవకాశం లేదని హిందూ సేన పేర్కొంది. ఆ విధంగా పరిపాలించాలని రాజ్యాంగంలో ఎక్కడ పేర్కొనబడలేదని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా అభిప్రాయ పడ్డారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి:

Special buses: 17, 18 తేదీల్లో 2,000 ప్రత్యేక బస్సులు.. దేనికోసమంటే...

Bharat Ratna 2024: భారతరత్నలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము.. అద్వానీకి మాత్రం..

Updated Date - Mar 30 , 2024 | 12:40 PM

Advertising
Advertising