ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ashwini Vaishnav : ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీ లేయర్‌కు నో!

ABN, Publish Date - Aug 10 , 2024 | 05:53 AM

‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ నిబంధన లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్‌లో పూర్తిస్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత..

  • సుప్రీంకోర్టు సూచనలపై క్యాబినెట్‌లో విస్తృతంగా చర్చించాం

  • రాజ్యాంగంలో క్రీమీలేయర్‌ నిబంధన లేదు: అశ్వినీ వైష్ణవ్‌

  • ఆవాస్‌ యోజన కింద మూడు కోట్ల ఇళ్లు

  • ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో 173.63 కి.మీ. కొత్త లైన్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ‘‘డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు కల్పించిన రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ నిబంధన లేదు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు సంబంధించి ఇటీవల సుప్రీం కోర్టు చేసిన నిర్దిష్టమైన సూచనలపై క్యాబినెట్‌లో పూర్తిస్థాయిలో చర్చించాం. మేధో మథనం తర్వాత.. రాజ్యాంగంలో ఉన్న నిబంధనలకే కట్టుబడి ఉండాలని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయించింది’’ అని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్‌ సమావేశం శుక్రవారం ఢిల్లీలో జరిగింది. అనంతరం ఆ వివరాలను వైష్ణవ్‌ విలేకరులకు వివరించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్‌ నిబంధనలన్నీ రాజ్యాంగం ప్రకారమే ఉంటాయని పునరుద్ఘాటించారు.

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు ఇటీవల సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. రాష్ట్రాలు తమ పరిధిలో వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. అదే సమయంలో, ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీలేయర్‌ను గుర్తించడానికి ఓ విధానాన్ని నిర్దేశించుకోవాలని, రిజర్వేషన్లలో నిజమైన సమానత్వం సాధించడానికి ఇదే మార్గమని కూడా వ్యాఖ్యానించింది.

ఈ నేపథ్యంలో, క్యాబినెట్‌ సమావేశంలో విస్తృత స్థాయిలో చర్చించి.. రాజ్యాంగానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించారు. తద్వారా, సుప్రీం కోర్టు సూచించినట్లు ఎస్సీ, ఎస్టీల్లో క్రీమీ లేయర్‌ను అమలు చేసేది లేదని తేల్చి చెప్పారు.


అలాగే, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద మరో మూడు కోట్ల ఇళ్లను నిర్మించాలని మోదీ 3.0 తొలి క్యాబినెట్‌లో తీర్మానించిన విషయం తెలిసిందే. తాజా భేటీలో అందుకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు కోట్ల ఇళ్లను నిర్మించనుంది. ఇందుకు రూ.3 లక్షల కోట్లు ఖర్చవుతుంది.

ఇందులో కేంద్రం రెండు లక్షల కోట్లు; రాష్ట్రాలు లక్ష కోట్లను ఖర్చు చేయనున్నాయి. అలాగే, పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లను నిర్మించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు రాబోయే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లను ఖర్చు చేయనుంది. కాగా, హార్టీకల్చర్‌ రంగాన్ని విప్లవాత్మకం చేయడంలో భాగంగా రూ.1766 కోట్లతో క్లీన్‌ ప్లాంట్‌ ప్రోగ్రామ్‌ (సీపీపీ) పథకానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. పంటను, నాణ్యతను దెబ్బతీస్తున్న వైరస్‌ ఇన్ఫెక్షన్ల సమస్యను పరిష్కరించడమే దీని ధ్యేయమన్నారు.


మోదీ హామీ ఇచ్చారు

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ విధానాన్ని అవలంభించాలని సూచిస్తూ ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆయా వర్గాలకు చెందిన బీజేపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. క్యాబినెట్‌ భేటీ కంటే ముందు వారు ప్రధాని మోదీని కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. మోదీని కలిసిన బృందంలో ఉన్న బీజేపీ రాజ్యసభ సభ్యుడు సికిందర్‌ కుమార్‌ పార్లమెంటు ఆవరణలో మీడియాతో మాట్లాడారు.

క్రీమీలేయర్‌ విషయంలో ప్రధాని మోదీ తమతో సుదీర్ఘంగా చర్చించారని.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ను అమలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్‌ విధానాన్ని తీసుకురావాలనేది ఒక జడ్జి సూచన మాత్రమేనని, అది మెజారిటీ తీర్పులో లేదని కేంద్ర మంత్రి అర్జున్‌ మేఘ్వాల్‌ తెలిపారు.

Updated Date - Aug 10 , 2024 | 05:53 AM

Advertising
Advertising
<