Heavy Rains: భారీ వర్షాలతో అసోం అతలాకుతలం.. మోదీ, షాలకు ఫోన్ చేసిన సీఎం
ABN, Publish Date - Jul 01 , 2024 | 06:23 PM
పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అసోంలో వరదలు పోటెత్తుతున్నాయని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సోమవారం తెలిపారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
గౌహతి: పొరుగున ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల(Heavy Rains) కారణంగా అసోంలో వరదలు పోటెత్తుతున్నాయని అసోం సీఎం హిమంత బిస్వా శర్మ(Himanta Biswa Sarma) సోమవారం తెలిపారు. బ్రహ్మపుత్ర దాని ఉపనదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో రానున్న రెండు మూడు రోజులపాటు నల్బరి, కర్బి అంగ్లాంగ్, దిమా హసావో, టిన్‌సుకియా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ శాఖ హెచ్చరికల కారణంగా సీఎం.. కేంద్రంతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని హిమంత తెలిపారు.
పరిస్థితిని ఎదుర్కోవటానికి అన్ని విధాల సాయంగా ఉంటామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇతర భద్రతా బలగాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు ఆయన సూచించారు.
బ్రహ్మపుత్ర, బరాక్ లోయలు సహా మొత్తం 14 జిల్లాల్లో 2,70,628 మంది వరదల కారణంగా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని అధికారులు వివరించారు. భారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. వరదలతో ఇప్పటివరకు 14 జిల్లాల్లోని 698 గ్రామాలపై ఎఫెక్ట్ పడింది. 2.74 లక్షల మంది తీవ్రంగా ప్రభావితమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి.
For Latest News and National News click here
Updated Date - Jul 01 , 2024 | 06:31 PM