ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గూడ్సును ఢీకొన్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు

ABN, Publish Date - Oct 12 , 2024 | 05:22 AM

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్‌లో లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ వెనుక నుంచి ఢీకొంది.

  • 2 బోగీలు దగ్ధం...పట్టాలు తప్పిన మరో 10

  • 40 మందికి తీవ్రగాయాలు.. ఆసుపత్రికి తరలింపు

  • తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఘటన

  • సాంకేతిక లోపంతో లూప్‌లైన్‌లోకి వచ్చిన ఎక్స్‌ప్రెస్‌

చెన్నై, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపేట రైల్వేస్టేషన్‌ వద్ద శుక్రవారం రాత్రి 8.30 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. రైల్వేస్టేషన్‌లో లూప్‌లైన్‌లో ఆగివున్న గూడ్సు రైలును మైసూరు నుంచి దర్భంగాకు వెళ్తున్న బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన రెండు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. మరో 10 బోగీలు పట్టాలు తప్పాయి.

  • ఎలా జరిగింది?

కర్ణాటకలోని మైసూరు నుంచి బిహార్‌లోని దర్భంగాకు శుక్రవారం ఉదయం 10.30 గంటలకు బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ రైలు బయలుదేరింది. ఆ రైలు జోలార్‌పేట, అరక్కోణం, పెరంబూరు మీదుగా గుమ్మిడిపూండి మార్గంలో రాత్రి 8.30 గంటల ప్రాంతంలో కవరైపేట రైల్వేస్టేషన్‌ వద్ద 90 కి.మీల వేగంతో ప్రయాణిస్తోంది. అయితే.. కవరైపేట వద్ద మెయిన్‌లైన్‌లో ప్రయాణించేందుకు సిగ్నల్‌ ఇచ్చారు. కానీ, అనూహ్యంగా భారీ శబ్దం చేస్తూ లూప్‌లైన్‌లోకి వెళ్లిపోయి.. అక్కడ ఆగి ఉన్న గూడ్సు రైలును వెనుక నుంచి ఢీకొంది. ఈ ఘటనలో బాగ్మతి ఎక్స్‌ప్రెస్‌ 12 బోగీల పట్టాలు తప్పాయి.


రెండు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగాయి. అయితే.. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదని, 40 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారని, వీరిలో 20 మందికి తీవ్రగాయాలైనట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి తెలియగానే రైల్వే భద్రతా విభాగం అధికారులు, తిరువళ్లూరు జిల్లా కలెక్టర్‌ ప్రభుశంకర్‌, మంత్రి ఎస్‌ఎం నాజర్‌ ఇతర అధికారులు అక్కడకు చేరుకున్నారు. కవరైపేట రైల్వేస్టేషన్‌ వద్ద సిగ్నల్‌ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రైలులో ప్రయాణించినవారి వివరాలను 044-25354151 నెంబర్‌కు ఫోన్‌ చేసి తెలుసుకోవచ్చునని రైల్వే అధికారులు ప్రకటించారు. రైలు ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే పలు రైళ్లను ప్రత్యామ్నాయ మార్గాలలో మళ్లించారు.

  • సహాయ చర్యలు వేగవంతం: స్టాలిన్‌

ప్రమాదం గురించి తెలియగానే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహాయ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. గాయపడిన వారికి ప్రత్యేక వైద్యనిపుణుల ద్వారా చికిత్సలు అందించాలన్నారు.

Updated Date - Oct 12 , 2024 | 05:22 AM