New Law : ‘బెయిల్’ కఠినం
ABN, Publish Date - Jul 01 , 2024 | 05:19 AM
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవటాన్ని సెక్షన్ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు.
పోలీసు కస్టడీలో 55-75 రోజులు
డిజిటల్ ఉపకరణాలను ట్యాంపర్
చేసి సాక్ష్యాధారంగా వాడే ముప్పు
కొత్త చట్టాల్లో వివాదాంశాలు..
అమలును వాయిదా కోరుతూ
సుప్రీంకోర్టులో పిటిషన్
ఏ చట్టంలో ఏముంది
భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)
మహిళలు, పిల్లలపై జరిగే నేరాలపై విచారణకు ప్రాధాన్యం ఇచ్చారు. పెళ్లి చేసుకుంటాననో లేదా మరో విధంగానో యువతులను మోసగించి లైంగికంగా సంబంధం పెట్టుకోవటాన్ని సెక్షన్ 69 ప్రకారం నేరంగా పరిగణిస్తారు. మైనర్‌పై గ్యాంగ్‌రే్‌పనకు పాల్పడిన వారికి మరణశిక్ష లేదా జీవితఖైదు విధిస్తారు.
బాధిత మహిళలను, పిల్లలను ఆస్పత్రిలో చేర్చగానే వారికి తొలుత ఉచితంగా వైద్యం అందించాల్సి ఉంటుంది.
ఉగ్రవాదం, ఉగ్రవాద చర్యలను తొలిసారిగా నిర్వచించి నేరచట్టం కిందికి తీసుకొచ్చారు.
ఇంతకుముందటి దేశద్రోహం నేరాన్ని రాజద్రోహంగా మార్పు చేశారు.
నిర్లక్ష్యంతో వాహనం నడిపించి మరణానికి కారణమైన నేరస్థులకు (హిట్ అండ్ రన్ కేసుల్లో) ఇప్పుడున్న రెండేళ్ల జైలు శిక్షను ఐదేళ్లకు పెంచారు.
మూకదాడిని హత్యతో సమానంగా పరిగణించి విచారిస్తారు.
శిక్ష అమలులో భాగంగా నిందితులతో సామాజిక సేవ చేయించటం అనే కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు.
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎ్‌సఎస్)
ఇప్పటి వరకున్న సీఆర్‌పీసీ ప్రకారం.. పోలీసులు తొలుత ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసిన తర్వాతే విచారణ ప్రారంభించాలి. వివాహ సంబంధిత వివాదాలు, వ్యాపార గొడవలు వంటి కొన్నింట్లోనే తొలుత విచారణ జరిపి ఆ తర్వాత అవసరమైతే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తారు. కానీ, కొత్త చట్టం ప్రకారం పోలీసులు ఏ కేసులోనైనా తొలుత ప్రాథమిక విచారణ జరిపి, అవసరమైతేనే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలి.
పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఘటన ఎక్కడ జరిగినా ఏ పోలీస్ స్టేషన్‌లోనైనా ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయవచ్చు. దీనినే జీరో ఎఫ్‌ఐఆర్‌గా వ్యవహరిస్తున్నారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఏదైనా ఘటనపై ఫోన్ తదితర సమాచార సాధనాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
అరెస్టు చేసిన వ్యక్తుల వివరాలను పోలీస్ స్టేషన్‌లో అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. తద్వారా సదరు వ్యక్తుల బంధుమిత్రులు తగు న్యాయపరమైన చర్యలు చేపట్టటానికి వీలవుతుంది.
ప్రస్తుతం ఈడీకి నిందితుల ఆస్తులను జప్తు చేసే అధికారం ఉన్నట్లుగా నేరాలపై దర్యాప్తు జరిపే సంస్థలకు కూడా ఆస్తుల జప్తు అధికారాల్ని ఈ కొత్త చట్టం కట్టబెడుతోంది.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిందితులు, బాధితులు, సాక్షులు విచారణకు హాజరు కావచ్చు. ఇదే పద్ధతిలో వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేయవచ్చు.
Updated Date - Jul 01 , 2024 | 05:26 AM