ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Rahul Gandhi: ఈ కేసులో రాహుల్ గాంధీకి ఉపశమనం

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:51 PM

బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi)కి ఉపశమనం లభించింది. ఈ క్రమంలో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది.

Rahul Gandhi

బీజేపీ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi)కి ఉపశమనం లభించింది. ఈ క్రమంలో బెంగళూరులోని ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో వార్తాపత్రికలలో బీజేపీ కర్నాటక యూనిట్‌పై 'అవమానకరమైన' ప్రకటనలను విడుదల చేసిన కేసులో కాంగ్రెస్ నాయకుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కర్ణాటక బీజేపీ వేసిన పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసు తదుపరి విచారణ జూలై 30న జరగనుంది.


గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రకటనల్లో కర్ణాటక బీజేపీ ప్రభుత్వం 2019-2023 వరకు వారి పాలనలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ సమయంలో బీజేపీ ప్రభుత్వం అన్ని ప్రజా పనుల్లో 40 శాతం కమీషన్ తీసుకుందని ఆరోపణలు చేసింది. ఆ క్రమంలో కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ 'కరప్షన్ రేట్ కార్డ్' పేరుతో పలు పత్రికల్లో ప్రచురణలు చేశారు. అదే సమయంలో రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో కూడా వాటిని షేర్ చేశారు.


దీంతో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లపై కర్ణాటక బీజేపీ పరువునష్టం కేసు వేసింది. ఈ కాంగ్రెస్ నేతలు నాటి ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా బీజేపీ నేతలపై ప్రముఖ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో సిద్ధరామయ్య, శివకుమార్‌లకు ప్రత్యేక కోర్టు జూన్ 1న బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసులో తాజాగా రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కావడంతో బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగాబరిలోకి..!!

T20 World Cup 2024: పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించిన అమెరికా

For Latest News and National News click here

Updated Date - Jun 07 , 2024 | 01:03 PM

Advertising
Advertising