Share News

Bangalore: నో ఎంట్రీ.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదు..

ABN , Publish Date - Sep 27 , 2024 | 11:18 AM

రాష్ట్రం కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులకు సంబంధించి సీబీఐ(CBI) నేరుగా విచారణ జరిపే ప్రక్రియకు చెక్‌ పెట్టేలా తీర్మానించింది. గురువారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 28 అంశాలు కేబినెట్‌ ముందు ప్రస్తావనకు రాగా రెండింటిని పెండింగ్‌లో పెట్టారు.

Bangalore: నో ఎంట్రీ.. రాష్ట్రంలో సీబీఐకి ప్రవేశం లేదు..

- కేబినెట్‌ సమావేశంలో తీర్మానం

- పశ్చిమబెంగాల్‌, తమిళనాడు తరహాలో నిర్ణయం

బెంగళూరు: రాష్ట్రం కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కేసులకు సంబంధించి సీబీఐ(CBI) నేరుగా విచారణ జరిపే ప్రక్రియకు చెక్‌ పెట్టేలా తీర్మానించింది. గురువారం సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో 28 అంశాలు కేబినెట్‌ ముందు ప్రస్తావనకు రాగా రెండింటిని పెండింగ్‌లో పెట్టారు. మిగిలిన 26 అంశాలకు మంత్రివర్గం తీర్మానించింది. అందులో ప్రధానంగా క్రిమినల్‌ కేసులకు సంబంధించి సీబీఐ విచారణకు అంగీకరించేలా ఢిల్లీ పోలీసులు స్థాపించిన 1946 సెక్షన్‌ 6 ప్రకారం గెజిట్‌ను రద్దు చేస్తున్నట్లు శాసనసభ, న్యాయ వ్యవహారాలశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ మీడియాకు వెల్లడించారు. ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్ మెంట్‌ చట్టం ప్రకారం కేంద్ర దర్యాప్తు సీబీఐ తమ అధికార పరిధిలో విచారణ జరిపేందుకు సంబంధిత రాష్ట్రాల నుంచి అనుమతులు పొందాల్సి ఉం టుంది.

ఈ వార్తను కూడా చదవండి: Bangalore: గుండెల్లో గుడి కట్టుకున్న అభిమానం..


సీబీఐ లేదా కేంద్ర దర్యాప్తు సంస్థలు కార్యాచరణ జరిపేవేళ వివేచనతో వ్యవహరించడం లేదనే కారణంతోనే రాష్ట్రంలో ఇకపై నేరుగా సీబీఐ విచారణ జరిపే విధానాన్ని రద్దు చేశామన్నారు. సీబీఐ పరిధిలో ఉండే అన్ని కేసులకు చార్జ్‌షీట్‌లు సమర్పించడం లేదని, కొన్ని పెండింగ్‌లో ఉన్నాయని, కొన్నింటికి సంస్థ దారి తప్పేలా వ్యవహరిస్తోందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ దారి తప్పేలా వ్యవహరిస్తున్నందున గెజిట్‌ను వాపసు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. ప్రతి కేసును పరిశీలించాకనే సీబీఐ దర్యాప్తుకు అప్పగించేలా తీర్మానిస్తామని హెచ్‌కే పాటిల్‌ తెలిపారు. ముడా ఇంటి స్థలాల వివాదంలో ముఖ్యమంత్రి ఎదుర్కొంటున్న కేసులకు, కేబినెట్‌ తీర్మానానికి ఎటువంటి సంబంధం లేదన్నారు.


కేబినెట్‌ ముందుకు రావాల్సిందే...

ఇటీవల గవర్నర్‌ పలు వివాదాలకు సంబంధించి లేఖలు రాస్తున్నారని, పదే పదే సమాచారం కోరుతూ ఒత్తిడి తీసుకొస్తున్నారని ఇకపై గవర్నర్‌ కోరిన ప్రతి లేఖకు సమాధానం కేబినెట్‌ ముందుకు రావాల్సిందేనని తీర్మానించామన్నారు. నెల రోజుల వ్యవధిలో గవర్నర్‌ పలు అంశాలపై వివరణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు రాశారన్నారు. వాటిని కేబినెట్‌ ముందుకు రాకుండానే పంపేందుకు వీలు లేదని చీఫ్‌ సెక్రటరీకి సూచిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు.


గవర్నర్‌తో మరింత దూరం..

రాష్ట్ర ప్రభుత్వం, రాజ్‌భవన్‌ల మధ్య దూరం పెరుగుతోంది. ఇటీవలే వైస్‌చాన్స్‌లర్ల నియామక ప్రక్రియను ప్రభుత్వమే కొనసాగించేలా తీర్మానించారు. కొన్నేళ్లకాలంగా ప్రభుత్వ యూనివర్సిటీలకు గవర్నర్‌ చాన్స్‌లర్‌గా వ్యవహరించే విధానం ఉంది. వైస్‌చాన్స్‌లర్‌లను ఆయనే నియమిస్తారు. కానీ నేరుగా రాష్ట్రప్రభుత్వమే నియమించేలా తీర్మానించారు. తాజాగా కేబినెట్‌లోనూ గవర్నర్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శికి వివిధ అంశాలు, పెండింగ్‌ కేసులు, ఆరోపణలకు సంబంధించి సమాచారం కోరుతూ రాస్తున్న లేఖలకు చెక్‌ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.


సాధారణంగా గవర్నర్‌ లేఖ పంపితే ప్రభుత్వ ప్రధానకార్యదర్శి బదులిచ్చేవారు. కానీ ఇకపై కేబినెట్‌లో చర్చ జరిగిన తర్వాతే గవర్నర్‌కు సమాధానం పంపాలని తీర్మానించారు. అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాజ్‌భవన్‌తో ప్రభుత్వం ఎటువంటి పరిస్థితులకైనా సై అనేలా సిద్ధమైంది. సీబీఐ దర్యాప్తును రాష్ట్రంలో నేరుగా కొనసాగించరాదనేలా పశ్చిమబెంగాల్‌, తమిళనాడు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా రాష్ట్రం కూడా జాబితాలో చేరింది.


ఇదికూడా చదవండి: Harish Rao: పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులివ్వండి

ఇదికూడా చదవండి: కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోకండి

ఇదికూడా చదవండి: KCR: కొండా లక్ష్మణ్‌ బాపూజీ కృషి అజరామరం

ఇదికూడా చదవండి: అబ్బో.. వీళ్ల పైత్యం మామూలుగా లేదుగా.. మెట్రోరైల్వేస్టేషన్‌లో అశ్లీల రీల్స్‌..

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2024 | 11:18 AM