Bengal's Shantanu Sinha's : అమిత్ మాలవీయ స్త్రీలోలుడు
ABN, Publish Date - Jun 11 , 2024 | 05:21 AM
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా అక్కడ పలువురు మహిళలతో శారీరకంగా గడిపేవారని పశ్చిమ బెంగాల్‌కే చెందిన శంతను సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. శృంగార కార్యకలాపాల కోసం ఆయన బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.
పశ్చిమ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా పలువురితో శారీరకంగా
గడిపేవాడు
బెంగాల్ బీజేపీ నేతలు పదవుల కోసం అమ్మాయిలను సరఫరా
చేస్తూనే ఉంటారా?
బెంగాల్‌కే చెందిన శంతను సిన్హా సంచలన ఆరోపణ.. ఆరెస్సెస్
ప్రతినిధినని వ్యాఖ్య
తీవ్రంగా ఖండించిన మాలవీయ.. శంతనుపై రూ.10కోట్లకు పరువు
నష్టం దావా
మాలవీయను వెంటనే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ పదవి నుంచి
తొలగించాలి: కాంగ్రెస్
శంతనుపై రూ.10కోట్లకు పరువు నష్టం దావా
న్యూఢిల్లీ/బెంగళూరు, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ బెంగాల్‌కు వచ్చినప్పుడల్లా అక్కడ పలువురు మహిళలతో శారీరకంగా గడిపేవారని పశ్చిమ బెంగాల్‌కే చెందిన శంతను సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. శృంగార కార్యకలాపాల కోసం ఆయన బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. శంతను తనను తాను ఆరెస్సెస్ అధికార ప్రతినిధిగా చెప్పుకొన్నారు.
‘‘మహిళలతో గడపటం కోసం మాలవీయ స్టార్ హోటళ్లనే కాకుండా బెంగాల్‌లోని బీజేపీ కార్యాలయాలను కూడా ఉపయోగించుకున్నారు’’ అని పేర్కొన్నారు. ‘‘బెంగాల్‌లోని బీజేపీ నేతలు తమ పదవులను కాపాడుకోవడం కోసం అమిత్ మాలవీయ లాంటి నాయకులకు ఇలా అమ్మాయిలను సరఫరా చేస్తూనే ఉంటారా’’ అని ప్రశ్నించారు. అయితే, ఈ ఆరోపణలను మాలవీయ ఖండించారు.
శంతను ఆరోపణలు అబద్ధమని, అత్యంత తీవ్రమైనవని పేర్కొన్నారు. ఆయనపై రూ.10కోట్లకు పరువు నష్టం దావా వేశారు. మూడు రోజుల్లోగా ఫేస్‌బుక్ పోస్టును తొలగించాలని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు లీగల్ నోటీసులు పంపించారు. ఈ గడువు మంగళవారంతో ముగియనుంది. మరోవైపు, శంతను ఆరెస్సెస్ ప్రతినిధిగా ఎప్పుడూ లేరని ఆ సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
మాలవీయను వెంటనే పదవి నుంచి తొలగించాలి
అమిత్ మాలవీయను వెంటనే బీజేపీ ఐటీ సెల్ చీఫ్ పోస్టు నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సత్వరమే సుమోటో కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేసింది. కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం చైర్‌పర్సన్ సుప్రియా శ్రీనతే సోమవారం మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఐటీ సెల్ చీఫ్‌గా మాలవీయ అత్యంత ప్రభావవంతమై పోస్టులో ఉన్నారని, ఆయన్ను ఆ పోస్టు నుంచి తొలగించకపోతే దర్యాప్తు ముందుకు సాగదని, బాధితులకు న్యాయం జరగదని అన్నారు. మాలవీయపై సాక్షాత్తూ ఆరెస్సె్‌సకు చెందిన వ్యక్తే ఈ ఆరోపణలు చేశారని సుప్రియ గుర్తు చేశారు.
ప్రజ్వల్‌కు 14రోజుల జ్యుడీషియల్ కస్టడీ
లైంగిక దౌర్జన్యాల ఆరోపణలతో అరెస్టయిన జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. పది రోజుల సిట్ కస్టడీ ముగియడంతో సిట్ అధికారులు 42వ ఏసీఎంఎం ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం ఎదుట సోమవారం హాజరు పరిచారు. సిట్ విచారణ ముగిసిందని, ఇక కస్టడీ అవసరం లేదని సిట్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. దీంతో జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ప్రజ్వల్ తరఫు న్యాయవాదులు కోరారు. న్యాయాధికారి 14రోజుల జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించారు.
Updated Date - Jun 11 , 2024 | 05:21 AM