ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru : ప్రయాణికులంతా ఎక్కారు.. పైలెట్లు లేరు

ABN, Publish Date - Jul 07 , 2024 | 04:09 AM

ఢిల్లీ నుంచి బెంగళూరు రావాల్సిన విమానం పైలెట్ల కొరత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్‌ కాకుండానే నిలిచిపోయింది.

  • 12 గంటల పాటు నిలిచిపోయిన స్పైస్‌జెట్‌ విమానం

బెంగళూరు, జూలై 6(ఆంధ్రజ్యోతి): ఢిల్లీ నుంచి బెంగళూరు రావాల్సిన విమానం పైలెట్ల కొరత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్‌ కాకుండానే నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు విమానంలో 12గంటలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ గడపాల్సి వచ్చింది. బెంగళూరు రావాల్సిన ఎస్‌జీ 8151 స్పైస్‌జెట్‌ విమానం శుక్రవారం రాత్రి 7.40 టేకాఫ్‌ కావాల్సి ఉంది. కానీ ఢిల్లీలో ఎంత సేపటికీ కదల్లేదు.

రాత్రి ఆహారం, ఇతర కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో ప్రయాణికులు ఆకలితో అలమటించారు. సోషల్‌ మీడియా ద్వారా స్పైస్‌జెట్‌ సంస్థ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగళూరు విమానాశ్రయానికి శనివారం ఉదయం చేరుకున్న ప్రయాణికులు అక్కడే స్పైస్‌జెట్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా, విమానాన్ని చీకట్లో నిలిపివేశారన్నా రు. పైలెట్ల కొరత వల్ల ఇలా జరిగినట్లు ఎయిర్‌లైన్స్‌ సంస్థ తెలిపింది.

Updated Date - Jul 07 , 2024 | 04:09 AM

Advertising
Advertising
<