ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bengaluru News: ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్.. ఒకతడి వాహనంపై రూ.49 వేల ఫైన్

ABN, Publish Date - Feb 26 , 2024 | 11:48 AM

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులను పట్టుకునేందుకు బెంగళూర్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఒకతడి వాహనాన్ని పరిశీలించగా రూ.49 వేలు కనిపించింది. ఫైన్ కట్టాలని స్పష్టం చేయడంతో సదరు వ్యక్తి జరిమానా చెల్లించాడు.

బెంగళూర్: ఐటీ హబ్ బెంగళూర్‌లో (Bengaluru) ట్రాఫిక్ చిక్కులు మాములుగా ఉండవు. ప్రధాన రహదారుల్లో వన్ వే ఎక్కువగా ఉంటాయి. వాటిని కొందరు బ్రేక్ చేసి కెమెరాలకు చిక్కుతుంటారు. ఒక్కో బైకర్ రూ.50 వేలు, ఆ పైగా ఫైన్ పడిపోయారు. బెంగళూర్‌ సిటీలో (Bengaluru) రూ.50 వేల కన్నా ఎక్కువ ఫైన్ ఉన్న టూ వీలర్స్ సంఖ్య 2681గా ఉందని పోలీసులు చెబుతున్నారు. టూ వీలర్స్, కార్లకు నోటీసులు అందజేశామని స్పష్టం చేశారు. ఫైన్ కట్టలేదంటే చార్జిషీట్ ఓపెన్ చేస్తామని, కోర్టు సమన్లు జారీచేస్తుందని తేల్చిచెప్పారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి, ఫైన్ కట్టకుండా తిరుగుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. రోజుకోకరు చొప్పున పట్టుబడుతున్నారు . రూ.49,100 ఫైన్ పడిన వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు.

రూ.49 వేల ఫైన్

యల్లంకా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. కేఏ 50 ఎస్ 3579 వాహనంపై ఉన్న పెండింగ్ చలాన్ చూశారు. రూ.49.100 ఫైన్ అని ట్యాబ్‌లో చూపించింది. చలాన్ కట్టాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. చేసేదేమీ లేక సదరు వ్యక్తి ఫైన్ మొత్తం కట్టేశాడు. ఆ తర్వాత పోలీసులు అతనితో ఫొటో తీసుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

రూ.3.2 లక్షల జరిమానా

సుధామ్‌నగర్‌కు చెందిన ఓ టూవీలర్‌ను పోలీసులు ఆపారు. అతని వాహనంపై ఉన్న చలాన్స్ పరిశీలించారు. రూ.3.2 లక్షలు ఉన్నట్టు చూపించింది. ఆ మొత్తం కట్టాలని పోలీసులు సూచించారు. తన వాహనం సెకండ్ హ్యాండ్‌లో విక్రయిస్తే రూ.30 వేలు వస్తోందని, రూ.3.2 లక్షలు ఎలా కట్టాలని పోలీసులను అడిగాడు. అయినప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. వాయిదా పద్దతిలో అయినాసరే ఫైన్ మొత్తం చెల్లించాలని తేల్చి చెప్పారు. జరిమానా కట్టకుంటే కేసు నమోదు చేస్తామని బెదిరించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 26 , 2024 | 11:48 AM

Advertising
Advertising