Bengaluru: రామేశ్వరం కేఫ్ వద్ద బ్యాగ్ పెట్టింది ఇతనే..!!
ABN, Publish Date - Mar 02 , 2024 | 10:39 AM
బెంగళూర్‌లో బాంబ్ పేలుడుతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్ వద్ద శుక్రవారం పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. బాంబ్ పెట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఆధారంగా దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి బాంబ్ పెట్టారని వివరించారు.
బెంగళూర్: బెంగళూర్‌లో (Bengaluru) బాంబ్ పేలుడుతో కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రద్దీగా ఉండే రామేశ్వరం కేఫ్ (Rameshwaram Cafe) వద్ద శుక్రవారం నాడు పేలుడు జరిగింది. పేలుడుకు గల కారణాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. బాంబ్ పెట్టిన వ్యక్తిని సీసీటీవీ ఆధారంగా గుర్తించారు. దక్షిణ కన్నడకు చెందినవాడని చెబుతున్నారు. పేలుడుకు సంబంధించి మరో వ్యక్తిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నిందితుడు మొహం గుర్తించే పనిలో ఉన్నారు. నిందితుడు బస్సులో శుక్రవారం రామేశ్వరం కేఫ్ వద్దకు వచ్చాడు. ఫుడ్ కౌంటర్ వద్ద కూపన్ తీసుకొని డైనింగ్ ప్రాంతానికి వెళ్లాడు. ఆర్డర్ చేసిన ఫుడ్ మాత్రం తినలేదు. డైనింగ్ ప్రాంతం దగ్గరలో బ్యాగ్ వదిలేసి వెళ్లిపోయాడు. అతను రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయిన తర్వాత బాంబ్ పేలింది. పేలుడుతో 10 మంది వరకు గాయపడ్డారు. బాంబ్ పేలుడు ఘటనపై పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడిని పట్టుకునేందుకు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు. బాంబ్ పేలుడు ఘటనకు సంబంధించి ఊహాగానాలను ప్రచారం చేయొద్దని మీడియాను బెంగళూర్ పోలీసు కమీషనర్ కోరారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 02 , 2024 | 10:44 AM