ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bengaluru: చిరు వ్యాపారిని చితక్కొట్టిన అల్లరి మూక.. ఎందుకంటే..?

ABN, Publish Date - Mar 18 , 2024 | 02:27 PM

ఐటీ హబ్ బెంగళూర్‌లో చిరు వ్యాపారిపై కొందరు పిడి గుద్దులు కురిపించారు. ఆదివారం సాయంత్రం సిద్దన్నగౌడ లేఔట్ వద్ద ఈ దాడి జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. సిద్దన్నగౌడ లే ఔట్ వద్ద ఓ షాపు ఉంది. ఆ వ్యాపారి సాయంత్రం పూట గట్టి శబ్దంతో పాటలు పెడుతున్నాడట. ఆ విషయం నిలదీసేందుకు కొందరు వచ్చారు. రంజాన్ మాసం అని, ప్రార్థనలు చేసే సమయంలో పాటలు పెట్టొద్దని కోరడంతో వాదన ప్రారంభమైంది.

బెంగళూర్: ఐటీ హబ్ బెంగళూర్‌లో (Bengaluru) చిరు వ్యాపారిపై కొందరు పిడి గుద్దులు కురిపించారు. ఆదివారం సాయంత్రం సిద్దన్నగౌడ లేఔట్ వద్ద ఈ దాడి జరిగింది. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది.

ఏం జరిగిందంటే..?

సిద్దన్నగౌడ లే ఔట్ వద్ద ఓ షాపు ఉంది. ఆ వ్యాపారి సాయంత్రం పూట గట్టి శబ్దంతో పాటలు పెడుతున్నాడట. ఆ విషయం నిలదీసేందుకు కొందరు వచ్చారు. రంజాన్ మాసం అని, ప్రార్థనలు చేసే సమయంలో పాటలు పెట్టొద్దని కోరడంతో వాదన ప్రారంభమైంది. అలా ఒకడు వచ్చి షాపు ఓనర్ కాలర్ పట్టుకోవడంతో గొడవ మొదలైంది. మరొకరు ఆ వ్యాపారిపై చేయి చేసుకున్నాడు. వ్యాపారి షాపు నుంచి బయటకు వచ్చాడు. అలా ఐదుగురు అతడిపై చేయి చేసుకున్నారు. మరొకతను కాలితో తన్నాడు.

కాసేపటి తర్వాత గొడవ సద్దుమణిగింది. దాంతో అక్కడి నుంచి వారు వెళ్లిపోయారు. దుకాణదారుడు తన షాపులోకి వెళ్లాడు. ఆ సమయంలో మొహంపై నుంచి రక్తం కారడం వీడియోలో కనిపించింది. ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు. దాడి చేసిన వ్యక్తులను గుర్తించామని, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని సెంట్రల్ డీసీపీ వివరించారు. దాడి చేసిన వారిలో సులేమాన్, షానవాజ్ ముస్లింలు కాగా, రోహిత్, ద్యానిష్, తరుణ హిందువులు ఉన్నారని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 18 , 2024 | 02:27 PM

Advertising
Advertising