LokSabha Elections: పోస్టాఫీసులకు క్యూ కడుతున్న మహిళలు ఎందుకుంటే..?
ABN, Publish Date - May 30 , 2024 | 04:41 PM
న్నికల వేళ.. పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. ఓ పుకారు బెంగళూరు మహానగరంలో షికారు చేస్తుంది. దీంతో ఆ నగరంలోని ముస్లిం మహిళలంతా ఖాతాలను తెరిచేందుకు పోస్టాఫీసులకు పోటెత్తుతున్నారు.
బెంగళూరు, మే 30: ఎన్నికల వేళ.. పుకార్లు షికారు చేస్తుంటాయి. అయితే తాజాగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల వేళ.. ఓ పుకారు బెంగళూరు మహానగరంలో షికారు చేస్తుంది. దీంతో ఆ నగరంలోని ముస్లిం మహిళలంతా ఖాతాలను తెరిచేందుకు పోస్టాఫీసులకు పోటెత్తుతున్నారు. దీంతో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి మరీ ముస్లిం మహిళలకు ఉన్నతాధికారులు పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరుస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ప్రతీ ఒక్క మహిళ ఖాతాలో నెలకు రూ. 8,500 వేస్తుందంటూ ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు ఆ పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొందంటూ ప్రచారం జరుగుతుంది. దీంతో మహిళలంతా ఖాతాలు తెరిచేందుకు బెంగళూరు మహా నగరంలోని పోస్టాఫీసులకు తరలి వస్తున్నారు. దీంతో పోస్టాఫీసులకు భారీగా తరలి వస్తున్నారు.
Also Read: భారీగా పెరిగిన రాజకీయ పార్టీలు
మరోవైపు ఇలా మహిళలు పోటెత్తడంపై పోస్టాఫీస్ ఉన్నతాధికారులు స్పందించారు. గతంలో పోస్టాఫీస్‌ల్లో రోజుకు 50 ఖాతాలు తెరిచే వారిమని చెప్పారు. అయితే గత వారం రోజుల్లో 8 వేల ఖాతాలు తెరిచామని వెల్లడించారు. అయితే ముస్లిం మహిళలు ఇలా రావడం.. పోస్టాఫీసుల్లో ఖాతాలు తెరవడం తొలుత తమకు ఆశ్చర్యం కలిగించిందన్నారు.
Also Read: ప్రధాని మోదీ సభలో ‘ఆమె’ ఎవరు?
ఆ క్రమంలో ఎందుకు ఇలా.. ఇంత మంది ఖాతాలు ప్రారంభిస్తున్నారని వారిని ప్రశ్నిస్తే.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ నెలా, ప్రతీ మహిళ ఖాతాలో రూ. 8500 వేస్తుందని వారు చెప్పారన్నారు. ఇంకోవైపు ప్రభుత్వ పథకాల ద్వారా చాలా మంది లబ్దిదారుల ఖాతాలో నగదు పడుతుందన్నారు. కానీ ఈ రూ.8,500 నగదు గురించి మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేదని పోస్టాఫీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Also Read: మోదీ ధ్యానంపై ఈసీకి లేఖ
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - May 30 , 2024 | 04:41 PM