ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP : సామాన్య కార్యకర్తకు పట్టం

ABN, Publish Date - Jun 10 , 2024 | 05:12 AM

బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడమే అనూహ్యం. అంతే అనూహ్యంగా ఆయనకు కేంద్రమంత్రిగా కూడా అవకాశం దక్కింది. 1967 ఆగస్టు 4న జన్మించిన ఆయనకు.. రొయ్య సాగు, వాణిజ్యంలో 20 ఏళ్లు, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు.

  • అనూహ్యంగా కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న శ్రీనివాసవర్మ

  • దక్కించుకున్న శ్రీనివాసవర్మ

  • నరసాపురంలో అద్భుత గెలుపు

  • సామాన్య కార్యకర్తకు పట్టం

బీజేపీలో సామాన్య కార్యకర్త స్థాయిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన భూపతిరాజు శ్రీనివాస వర్మ నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి విజయం సాధించడమే అనూహ్యం. అంతే అనూహ్యంగా ఆయనకు కేంద్రమంత్రిగా కూడా అవకాశం దక్కింది. 1967 ఆగస్టు 4న జన్మించిన ఆయనకు.. రొయ్య సాగు, వాణిజ్యంలో 20 ఏళ్లు, రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో 30 ఏళ్ల అనుభవం ఉంది. 1991 నుంచి 95 వరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడిగా, 1995 నుంచి 97 వరకు పార్టీ భీమవరం పట్టణ అధ్యక్షుడిగా పనిచేశారు. 2009లో బీజేపీ తరఫున ఎంపీగా పోటీచేసి ఓడిపోయారు. గత ఏడాది వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. టీడీపీ-జనసేన కూటమి మద్దతుతో నరసాపురం ఎంపీ స్థానం నుంచి 2.76 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన తల్లిదండ్రులు.. సీత, సూర్యనారాయణరాజు. భార్య పేరు వెంకటేశ్వరీదేవి.

  • ఎన్నో ఏళ్ల శ్రమకు ఫలితం: వర్మ

తనకు కేంద్ర మంత్రి పదవి రాత్రికి రాత్రే రాలేదని, ఇది ఎన్నో ఏళ్ల శ్రమకు దక్కిన ఫలితమని శ్రీనివాస వర్మ తెలిపారు. ఢిల్లీలో ప్రమాణ స్వీకారానికి ముందు ఆయన మాట్లాడారు. గడచిన ఐదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని చెప్పారు. దేశంలో రాష్ట్రంలో రెండుచోట్లా ఎన్డీయే ప్రభుత్వాలే ఉన్నందున అభివృద్థికి అన్నివిధాలా అనుకూల సమయమని చెప్పారు.

Read more!

Updated Date - Jun 10 , 2024 | 05:16 AM

Advertising
Advertising