ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bihar Police : : 50 గ్రాములు... రూ. 850 కోట్లు!

ABN, Publish Date - Aug 11 , 2024 | 05:13 AM

రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్‌ చేస్తుండగా బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 50గ్రాముల రాయి విలువ రూ.850 కోట్లు పలుకుతుందని అంచనా.

  • ‘కాలిఫోర్నియం’ రాయిని తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్న బిహార్‌ పోలీసులు

  • పోర్టబుల్‌ మెటల్‌ డిటెక్టర్లలో రేడియోధార్మిక పదార్థం వినియోగం

  • బిహార్‌లో ‘కాల్నిఫోర్నియం’ రాయి స్వాధీనం

పట్నా, ఆగస్టు 10: రేడియోధార్మిక పదార్థమైన కాలిఫోర్నియం రాయిని స్మగ్లింగ్‌ చేస్తుండగా బిహార్‌ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో 50గ్రాముల రాయి విలువ రూ.850 కోట్లు పలుకుతుందని అంచనా.

గుజరాత్‌ నుంచి మోటారు సైకిళ్లపై ముగ్గురు వ్యక్తులు దీనిని తీసుకొస్తున్నారనే కచ్చితమైన సమాచారంతో గోపాల్‌గంజ్‌ జిల్లా పోలీసులు.. బల్త్‌హారి చెక్‌పోస్టు వద్ద గురువారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నారు.

వారి దగ్గర నుంచి నాలుగు మెబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కాల్నిఫోర్నియం ఒక్కో గ్రాము ధర రూ.17 కోట్లు పలుకుతుందని, ఇందుకు సంబంధించి వారి వద్ద ఉన్న టెస్ట్‌ రిపోర్టులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. కాలిఫోర్నియంను పోర్టబుల్‌ మెటల్‌ డిటెక్టర్లలో ఉపయోగిస్తారు. మరోవైపు, రాజస్థాన్‌లోని అనూ్‌పఘర్‌ జిల్లాలో పాకిస్థాన్‌ సరిహద్దు వద్ద హెరాయిన్‌ ప్యాకెట్‌ను మోసుకొని వస్తున్న డ్రోన్‌ను బీఎ్‌సఎఫ్‌ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - Aug 11 , 2024 | 05:15 AM

Advertising
Advertising
<