ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Odisha: ఒడిశాలో హంగ్ అసెంబ్లీ..!! బీజేపీ కీ రోల్

ABN, Publish Date - Jun 03 , 2024 | 09:55 AM

బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది.

BJD vs BJP At Odisha

భువనేశ్వర్: బిజు జనతాదళ్ కంచుకోట ఒడిశా. ఇక్కడ ఆ పార్టీ అధికారానికి తిరుగులేదు. నవీన్ పట్నాయక్ ఐదుసార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. గత 24 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఈ సారి మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బీజేపీ కీలక పాత్ర పోషించబోతుంది. కాషాయ పార్టీ మెజార్టీ సీట్లు గెలువనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ నిజమైతే ఒడిశాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడటం ఖాయం.


బీజేపీకి 62 నుంచి 80

ఒడిశా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు మే 13వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు నాలుగు విడతల్లో జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ ఛరిస్మాను చూపి బీజేపీ ఎన్నికల్లోకి వెళ్లింది. అధికార బీజేడీ నవీన్ పట్నాయక్ పేరు అలాగే ఒడిశాలో చేపట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రస్తావించింది. ఒడిశా అసెంబ్లీలో 147 సీట్లు ఉన్నాయి. అధికారం చేపట్టేందుకు 74 సీట్లు గెలిస్తే సరిపోతుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 112 సీట్లు గెలిచి విజయదుందుభి మోగించింది. ఈ సారి పరిస్థితి మరోలా ఉంది. బీజేపీ 62 నుంచి 80 సీట్లు గెలుచుకుంటుందని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా సర్వే స్పష్టం చేసింది. దీంతో బీజేడీ విజయానికి బ్రేకులు వేసినట్టు అవుతోంది. అలా జరిగితే నవీన్ పట్నాయక్ అధికారానికి దూరంలో ఉండే ఛాన్స్ ఉంది.


5.8 లక్షల మంది అభిప్రాయం

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ దేశవ్యాప్తంగా 5.8 లక్షల మంది అభిప్రాయం తీసుకొని సర్వే చేపట్టింది. ఒడిశా రాష్ట్రంలో బీజేపీకి 42 ఓటు శాతం ఉంది. బీజేపీ ఓటు శాతం పెరిగింది. దీంతో బీజేడీ ఓటు శాతం గణనీయంగా పడిపోయింది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 12 శాతం మాత్రమే ఓటు శాతం ఉంది. ఒడిశాలో 21 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీకి 18 నుంచి 20 సీట్ల వరకు వస్తాయి అంటున్నారు. బీజేడీ కేవలం 2 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేసింది.

Updated Date - Jun 03 , 2024 | 09:55 AM

Advertising
Advertising