ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jammu and Kashmir elections: మోదీ లీడ్ క్యాంపెయినర్‌గా 40 మందితో బీజేపీ లిస్ట్

ABN, Publish Date - Aug 26 , 2024 | 07:53 PM

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 15 మంది అభ్యర్థుల తొలి జాబితాను సోమవారంనాడు విడుదల చేసిన బీజేపీ తొలి విడత ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది. ఆ ప్రకారం జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉంటారు.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే 15 మంది అభ్యర్థుల తొలి జాబితాను సోమవారంనాడు విడుదల చేసిన బీజేపీ (BJP) తొలి విడత ప్రచారంలో పాల్గొనే 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను కూడా విడుదల చేసింది. ఆ ప్రకారం జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు.

Kangana Ranaut: ఎంపీ కంగనా రనౌత్‌కు ఊహించని షాకిచ్చిన సొంత పార్టీ బీజేపీ


కాగా, స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పలు రాష్ట్రాలు ముఖ్యమంత్రుల పేర్లను కూడా ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ తొలిదశ ప్రచారంలో పాల్గొంటారు. బీజేపీ మాజీ ప్రధాన కార్య దర్శి, ఇటీవలే జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్‌చార్జిగా నియమితులైన రామ్ మాధవ్, జమ్మూకశ్మీర్ పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి తరుణ్ చుగ్, జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా, ఎంపీ జుగల్ కిషోర్ శర్మ, రాజ్యసభ సభ్యుడు గులాం అలీ ఖతన, ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) అశోక్ కౌల్, జమ్మూకశ్మీర్ బీజేపీ ఉపాధ్యక్షుడు సోఫి యూసుఫ్ సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. 90 మంది సభ్యుల జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మూడు విడతలుగా సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న పోలింగ్ జరుగుతుంది. అక్టోబర్ 4న ఫలితాలు వెలువడతాయి. 2019లో 370వ అధికరణ రద్దు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా రాష్ట్రాన్ని విభజించిన తరువాత జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడం విశేషం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 26 , 2024 | 08:00 PM

Advertising
Advertising
<