BJP: అట్టహాసంగా అమిత్‌షా రోడ్‌షో.. మోదీ నినాదాలతో దద్దరిల్లిన మదురై
ABN, Publish Date - Apr 13 , 2024 | 01:30 PM
మదురైలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) బీజేపీ అభ్యర్థి రామశ్రీనివాసన్‌కు మద్దతుగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షో ఆద్యంతం అట్టహాసంగా సాగింది. ఈ రోడ్‌షోలో పాల్గొనే నిమిత్తం ఆయన తొలుత మదురై విమానాశ్రయానికి చేరుకున్నారు.
చెన్నై: మదురైలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా(Union Home Minister Amit Shah) బీజేపీ అభ్యర్థి రామశ్రీనివాసన్‌కు మద్దతుగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షో ఆద్యంతం అట్టహాసంగా సాగింది. ఈ రోడ్‌షోలో పాల్గొనే నిమిత్తం ఆయన తొలుత మదురై విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో కారైక్కుడికి వెళ్లి అక్కడి నుంచి కారులో పుదుకోట జిల్లా తిరుమయ్యమ్ కోట్టై భైరవర్ ఆలయాన్ని, సత్యవాగీశ్వరాలయాన్ని సందర్శించారు. ఆ తర్వాత సాయంత్రం మదురై నగరానికి చేరుకున్న అమిత్‌షాకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రథం ఆకారంలో రూపొందించిన వ్యాన్ ఎక్కి రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్‌షో ప్రారంభమైనప్పటి నుంచికార్యకర్తలంతా ‘మోదీ మోదీ’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. రహదారికి ఇరువైపులా చండీ మేళాలు, మంగళవాయిద్యాలు, బ్యాండ్ వాయిద్యాల నడుమ ఈ రోడ్‌షో ప్రారంభమైంది. మదురై నేతాజీ రోడ్డు నుంచి ఝాన్సీరాణి పార్కు, నగల దుకాణం బజార్ మీదుగా విలక్కుతూన్ ప్రాంతం వరకు రోడ్‌షో కొనసాగింది. ఈ కార్యక్రమంలో ‘భారత్ మాతాకీ జై.. జై బీజేపీ, మా ఓట్లన్నీ బీజేపీకే’ అంటూ కార్యకర్తల చేసిన నినాదాలు మిన్నంటాయి. అమిత్‌షా తామర గుర్తు ముద్రించిన ప్లాస్టిక్ బొమ్మను పట్టుకుని రహదారికి ఇరువైపులా నిలిచిన ప్రజలకు అభివాదం చేస్తూ, ప్రజలపై గులాబీ పూల వర్షం కురిపిస్తూ సందడి చేశారు. అమిత్‌షా వాహనానికి ముందుగా భారతమాత, కాళికాదేవి, దేవతమూర్తుల వేషధారణలతో కళాకారులు నడిచి వెళ్లారు. అదే సమయంలో వందలాదిమంది కార్యకర్తలు ప్రధాని నరేంద్రమోదీ మాస్కులు ధరించి సందడి చేశారు. అమిత్‌షా రోడ్‌షోకు పోలీసులు భారీ భద్రతా కల్పించారు.
ఇదికూడా చదవండి: BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్‌పై కేసు నమోదు.. కారణం ఏంటంటే...
Updated Date - Apr 13 , 2024 | 01:30 PM