ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్ ఫైర్.. బీపీఎల్‌ కార్డుల రద్దు పేదల కడుపు కొట్టడమే

ABN, Publish Date - Nov 22 , 2024 | 01:17 PM

బీపీఎల్‌ కార్డుల రద్దు ద్వారా సామాన్యులు, పేద వర్గాల కడుపుకొట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కుంటి సాకులు చెబుతూ గ్యారెంటీల్లో ఒక్కొక్క దానికి తొలగించే కుట్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) మండిపడ్డారు.

- బీపీఎల్‌ కార్డుల రద్దుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర మండిపాటు

- పునరుద్ధరించకుంటే శాసనసభలో పోరాటమే: ప్రతిపక్షనేత అశోక్‌

బెంగళూరు: బీపీఎల్‌ కార్డుల రద్దు ద్వారా సామాన్యులు, పేద వర్గాల కడుపుకొట్టేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కుంటి సాకులు చెబుతూ గ్యారెంటీల్లో ఒక్కొక్క దానికి తొలగించే కుట్ర అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(BJP state president Vijayendra) మండిపడ్డారు. హుబ్బళ్ళిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనేలా వ్యవహరిస్తున్నారన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Minister: విద్యుత్‌ శాఖకు అదానీ సంస్థతో సంబంధాల్లేవు..


ఇప్పటికే 11.5 లక్షల కార్డులు రద్దు చేశారని, మరో 15 లక్షల బీపీఎల్‌ కార్డులు రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. పాన్‌ కార్డులు వీధి వ్యాపారులు సైతం ఉపయోగిస్తున్నారన్నారు. ఆ సాకుతో కార్డులు రద్దు చేయడం తగదన్నారు. వెంటనే ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకుంటే తీవ్రస్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. బీజేపీ(BJP) ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో ఆందోళనలు జరిగాయి.


మాజీ సీఎం బసవరాజ్‌ బొమ్మై, ప్రతిపక్షనేత అశోక్‌, ఎంపీ పీసీ మోహన్‌, జయనగర్‌ ఎమ్మెల్యే కేసీ రామమూర్తి గురువారం అరసు కాలనీలో రేషన్‌కార్డులు రద్దు అయిన పేదల సమస్యలు ఆలకించారు. సీఎం సిద్దరామయ్య అన్నభాగ్య పథకాన్ని కన్నభాగ్యగా మార్చారని అశోక్‌ మండిపడ్డారు. 45ఏళ్లుగా చిన్నపాటి ఇళ్లల్లో నివసిస్తూ కాలం గడుపుతున్న పేదల రేషన్‌కార్డులను కుంటిసాకులతో రద్దు చేశారన్నారు. అన్నం ఆరోగ్యం పేరిట మోసం చేయడం మంచిదికాదన్నారు. వెంటనే ప్రభుత్వం రేషన్‌కార్డులను పునరుద్ధరించకుంటే శాసనసభలో పోరాటం చేస్తామని హెచ్చరించారు.


ఈవార్తను కూడా చదవండి: ప్రేమోన్మాది ఘాతుకం.. తరగతి గదిలో టీచర్ దారుణహత్య

ఈవార్తను కూడా చదవండి: మావోయిస్టుల దుశ్చర్య.. ఏం చేశారంటే..

ఈవార్తను కూడా చదవండి: రేవంత్‌తో టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు భేటీ

ఈవార్తను కూడా చదవండి: అదానీతో బీజేపీ, కాంగ్రెస్‌ అనుబంధం దేశానికే అవమానం: కేటీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Nov 22 , 2024 | 01:17 PM