Lok Sabha Elections 2024: ఖాతా తెరిచిన బీజేపీ.. ఎన్నికలు అవ్వకుండానే అభ్యర్థి గెలుపు.. అదెలాగంటే?
ABN, Publish Date - Apr 22 , 2024 | 04:47 PM
ఎన్నికలు అవ్వకముందే ఓ అభ్యర్థి గెలుపొందడం ఎప్పుడైనా చూశారా? ఈ చమత్కారం గుజరాత్‌లో చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ముకేష్ దలాల్ సూరత్ స్థానం నుంచి కౌంటింగ్‌కి ముందే ఏకపక్షంగా గెలిచారు. దీంతో.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఖాతా తెరిచినట్టయ్యింది.
ఎన్నికలు అవ్వకముందే ఓ అభ్యర్థి గెలుపొందడం ఎప్పుడైనా చూశారా? ఈ చమత్కారం గుజరాత్‌లో (Gujarat) చోటు చేసుకుంది. బీజేపీ (BJP) అభ్యర్థి ముకేష్ దలాల్ (Mukesh Dalal) సూరత్ స్థానం నుంచి కౌంటింగ్‌కి ముందే ఏకపక్షంగా గెలిచారు. దీంతో.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) బీజేపీ ఖాతా తెరిచినట్టయ్యింది. అసలు కౌంటింగ్‌కి ముందే ఇదెలా సాధ్యం? అని అనుకుంటున్నారా..! కాంగ్రెస్ (Congress) అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడటంతో పాటు ఇతర అభ్యర్థులు తమ నామినేషన్‌ని వెనక్కు తీసుకోవడం వల్లే.. ముకేష్ దలాల్‌ని విన్నర్‌గా ప్రకటించడం జరిగింది.
షాకింగ్ ఘటన.. కంట్లో కారం కొట్టి, పెళ్లికూతురిని ఈడ్చుకెళ్తూ..
కాంగ్రెస్ పార్టీ తరఫున సూరత్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు నీలేష్ కుంభానీ ఇటీవల తమ నామినేషన్ దాఖలు చేశారు. అయితే.. ఆయన నామినేషన్ పత్రాలపై తాము సంతకం చేయలేదని ముగ్గురు ప్రతిపాదకులు ఎన్నికల అధికారికి అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తద్వారా నీలేష్ నామినేషన్‌ని ఎన్నికల సంఘం తిరస్కరించింది. దీంతో.. గుజరాత్ కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్‌తో పాటు ఎన్నికల ఏజెంట్ దినేష్ జోధానీ అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత ఈ వివాదం తలెత్తింది. అటు.. కాంగ్రెస్ బ్యాకప్ అభ్యర్థి సురేష్ పద్సాలాకు కూడా ఇదే పరిస్థితి ఎదురవ్వడంతో, ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు.. అమెరికా రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు
ఈ వ్యవహారంపై నీలేష్ స్పందిస్తూ.. సంతకాల ప్రామాణికతను సమర్థించారు. చేతివ్రాత నిపుణుడు, సంతకం చేసిన వారు వాటిని ధృవీకరించాలని కోరారు. అయినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. అఫిడవిట్, పరిశీలన సమయంలో సమర్పించిన అదనపు ఆధారాల ప్రకారం.. నామినేషన్ తిరస్కరణను రిటర్నింగ్ అధికారి ధృవీకరించారు. ఇలా నిలేష్ నామినేషన్ తిరస్కరణకు గురవ్వడంతో పాటు ఇతర పార్టీ అభ్యర్థులు తమ నామినేషన్‌ని వెనక్కు తీసుకోవడంతో.. బీజేపీ అభ్యర్థి సూరత్ నుంచి గెలుపొందారు. మరోవైపు.. ఈ నిర్ణయాన్ని హైకోర్టులో సవాలు చేయాలని కాంగ్రెస్ యోచిస్తోందని, ఆ పార్టీ తరఫున న్యాయవాది బాబు మంగూకియా తెలిపారు.
నామినేషన్ ఉపసంహరించుకున్న ఇతర అభ్యర్థులు
లాగ్ పార్టీ - సోహీల్ షేక్
గ్లోబల్ రిపబ్లికన్ పార్టీ - జయేష్‌బాహి మేవాడా
బహుజన్ సమాజ్ పార్టీ - ప్యారేలాల్ భారతి
సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీ - అబ్దుల్ హమీద్ ఖాన్
పలువురు స్వతంత్ర అభ్యర్థులు
Read Latest National News And Telugu News
Updated Date - Apr 22 , 2024 | 04:47 PM