Lok Sabha Elction results: కౌంటింగ్ వేళ.. నడ్డా నివాసంలో బీజేపీ కీలక సమావేశం
ABN , Publish Date - Jun 03 , 2024 | 04:48 PM
లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, వెలువడే ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారంనాడు సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు హాజరయ్యారు.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్, వెలువడే ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సోమవారంనాడు సమావేశమయ్యారు. హోం మంత్రి అమిత్‌షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వినోద్ తావ్డే, మనోహర్ లాల్ ఖత్తార్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివ్ ప్రకాష్, మన్షుక్ మండవీయ, బీఎల్ సంతోష్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
CEC: ఇది మంచి పద్ధతి కాదు.. జైరామ్ రమేష్‌కు సీఈసీ అక్షింతలు
అగ్రనేతలతో కీలక సమావేశంపై బీజేపీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సమావేశంలో ప్రధానంగా విపక్షాలు అనుసరించే వ్యూహాలను సమర్ధవంతంగా ఎదుర్కొనడంపై చర్చించినట్టు తెలుస్తోంది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ఘనవిజయం సాధించనున్నట్టు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెలువడటం, ఆ ఫలితాలను తోసిపుచ్చుతూ 'ఇండియా' కూటమి వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని బీజేపీ అగ్రనేతలు సమీక్షించినట్టు సమాచారం. ఇప్పటికే జూన్ 4న కౌంటింగ్ సమయంలో ఎలాంటి హింస, అశాంతికి తావులేని విధంగా చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ప్రతినిధుల బృందం కోరింది. దీనికి ముందు 'ఇండియా' కూటమి నేతలు సైతం ఈసీని కలిసి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిపి వాటి ఫలితాలను ఈవీఎంలో ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడించకముందే ప్రకటించాలని కోరింది. కౌంటింగ్ ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకాలను ఎన్నికల ప్యానెల్ జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.
For Latest News and National News click here