ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

LK Advani: క్షీణించిన ఎల్‌కే అద్వానీ ఆరోగ్యం.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక

ABN, Publish Date - Jun 27 , 2024 | 06:58 AM

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ(delhi)లోని ఎయిమ్స్‌(aiims)లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు.

L K Advani admitted to delhi aiims

మాజీ ఉప ప్రధాని, బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ(LK Advani) ఆరోగ్యం క్షీణించడంతో ఢిల్లీ(delhi)లోని ఎయిమ్స్‌(aiims)లో చేర్పించారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను బుధవారం రాత్రి 10.30 గంటలకు ఎయిమ్స్‌లోని పాత ప్రైవేట్ వార్డులో చేర్చారు. అద్వానీకి యూరాలజీకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. యూరాలజీ ప్రొఫెసర్ డాక్టర్ అమలేష్ సేథ్ ఆధ్వర్యంలో ఆయన చికిత్స పొందుతున్నారు. అద్వానీ మెడికల్ బులెటిన్‌ను ఎయిమ్స్ వైద్యులు, వైద్య నిపుణులు త్వరలో విడుదల చేయనున్నారు.


ఇటివల భారతరత్న

ఎల్‌కే అద్వానీ దేశ అత్యున్నత పౌర గౌరవ పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది 2024లోనే స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎల్‌కే అద్వానీ నివాసానికి వెళ్లి భారతరత్నతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖర్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా పాల్గొన్నారు. అద్వానీ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆయన నివాసంలోనే ఆయనకు భారతరత్నను ప్రదానం చేశారు.


ఎల్‌కే అద్వానీ ఎవరు?

ఎల్‌కే అద్వానీ 1927 నవంబర్ 8న ప్రస్తుత పాకిస్థాన్‌లోని కరాచీలో జన్మించారు. సెప్టెంబర్ 12, 1947న పాకిస్థాన్‌ను విడిచిపెట్టి అతని కుటుంబం భారతదేశానికి వచ్చిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. లాల్ కృష్ణ అద్వానీకి ఒక కుమార్తె ప్రతిభా అద్వానీ, కుమారుడు జయంత్ అద్వానీ ఉన్నారు. అద్వానీ కొడుకు, కుతురు ఇద్దరూ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ స్కూల్ నుంచి తన ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. విభజన తర్వాత భారతదేశంలోని ముంబైలోని ప్రభుత్వ న్యాయ కళాశాల నుంచి న్యాయ పట్టా అందుకున్నారు. అద్వానీ ఫిబ్రవరి 25, 1965న కమల అద్వానీని వివాహం చేసుకున్నారు.


ఆర్‌ఎస్‌ఎస్‌తో అనుబంధం

అద్వానీ దేశభక్తి కారణంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వైపు మొగ్గు చూపారు. 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు, లాల్ కృష్ణ అద్వానీ ఈ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకోలేకపోయారు. ఎందుకంటే అప్పుడు ఆయన పాకిస్తాన్‌లో ఉన్నారు. దేశ విభజన తర్వాత కరాచీ నుంచి ఢిల్లీకి వచ్చి రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సంఘ్ ప్రచారక్‌గా చాలా కాలం పనిచేశారు. 1947 నుంచి 1951 వరకు కరాచీ శాఖ RSS కార్యదర్శిగా, భరత్‌పూర్, అల్వార్, బుండి, కోట, ఝలావర్‌లలో RSS కార్యక్రమాలను నిర్వహించారు.


రాజకీయ ప్రయాణం

లాల్ కృష్ణ అద్వానీ రాజకీయ ప్రయాణం గురించి మాట్లాడుకుంటే 1951లో డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్ సంఘ్ స్థాపించినప్పుడు, 1957 వరకు అద్వానీ పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆ తర్వాత 1973 నుంచి 1977 వరకు జన్ సంఘ్ అధ్యక్షుడిగా పనిచేశారు. 1980లో భారతీయ జనతా పార్టీ స్థాపించినప్పుడు, ఆయన దాని వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. అద్వానీ 1980 నుంచి 1986 వరకు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 1986 నుంచి 1991 వరకు బీజేపీ అధ్యక్షుడిగా వర్క్ చేశారు. అద్వానీ మూడుసార్లు బీజేపీ అధ్యక్షుడిగా, 5 సార్లు లోక్‌సభ ఎంపీగా, 4 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 1977 నుంచి 1979 వరకు తొలిసారిగా కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. ఆ కాలంలో సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టారు.

'హీరో' అద్వానీ

రాజకీయాల్లో ‘యాత్రల’ సంస్కృతికి నాంది పలికిన నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ. అయోధ్యలో రామమందిరానికి డిమాండ్ ఉధృతంగా ఉన్న సమయంలో, లాల్ కృష్ణ అద్వానీ గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి అయోధ్య వరకు రథయాత్ర ప్రారంభించారు. దీని కారణంగా దేశ రాజకీయాల్లో హిందూత్వ రాజకీయాలు ఉద్భవించాయి. కానీ బీహార్‌లో అప్పటి ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆయనను సమస్తిపూర్‌లో అరెస్టు చేశారు. ఈ సంఘటన తర్వాత అద్వానీ రాజకీయాల్లో హీరోగా ఎదిగారు.


ఇవి కూడా చదవండి:

Yogi Adityanath : పేపర్‌ లీక్‌ చేస్తే రూ.కోటి జరిమానా

Bengaluru : సూరజ్‌ రేవణ్ణ కేసులో ట్విస్ట్‌.. శివకుమార్‌ యూటర్న్‌

ఆగని రికార్డుల హోరు

Read Latest National News and Telugu News

Updated Date - Jun 27 , 2024 | 07:13 AM

Advertising
Advertising