ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

BJP MLC CT Ravi: నేనేమైనా ఉగ్రవాదినా.. అప్రమత్తంగా లేకపోతే ఎన్‌కౌంటర్‌ చేసేవారు

ABN, Publish Date - Dec 21 , 2024 | 11:41 AM

‘నేనేమైనా ఉగ్రవాదినా..’ రెండు దశాబ్దాల రాజకీయంలో వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు, సంస్థాగతంగా రాజకీయంగా మాత్రమే మాట్లాడుతా... అటువంటిది నన్ను టార్గెట్‌ చేసి చిత్రహింసలకు గురి చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు.

- నా గురించి తెలుసుకోండి...

- ప్రభుత్వంపై సీటీ రవి ఆగ్రహం

బెంగళూరు: ‘నేనేమైనా ఉగ్రవాదినా..’ రెండు దశాబ్దాల రాజకీయంలో వ్యక్తిగతంగా ఎవరినీ కించపరచలేదు, సంస్థాగతంగా రాజకీయంగా మాత్రమే మాట్లాడుతా... అటువంటిది నన్ను టార్గెట్‌ చేసి చిత్రహింసలకు గురి చేశారని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి(BJP MLC CT Ravi) ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బెళగావి నుంచి బెంగళూరు కోర్టుకు తరలిస్తుండగా దావణగెరె సమీపానికి చేరేసరికే హైకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో పోలీసులు విడుదల చేశారు. అనంతరం సీటీ రవి, ప్రతిపక్షనేత అశోక్‌, బీజేపీ అధ్యక్షుడు విజయేంద్రలతో కలసి మీడియాతో మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆరు రోజులు వర్ష సూచన


తనగురించి చిక్కమగళూరులో తెలుసుకోవాలన్నారు. తనను విమర్శించే మంత్రులు, డీసీఎం కూడా తన వ్యవహార శైలి గురించి తెలుసుకోవాలన్నారు. కాగా సువర్ణసౌధలోనే డీసీఎం డీకే శివకుమార్‌(DCM DK Shivakumar), మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌లు ప్రాణాలు తీస్తామని హెచ్చరించారన్నారు. తాను ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేసేవారని ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని బెళగావి(Belagavi) ఐదో జేఎంఎఫ్‌సీ కోర్టు న్యాయమూర్తి వద్ద వివరించానన్నారు. సువర్ణసౌధలోనే అరెస్టు చేశారని ఆ తర్వాత రాత్రంతా పలు పోలీస్ స్టేషన్‌లకు తిప్పారని న్యాయమూర్తికి వివరించానన్నారు.


ఖానాపుర పోలీసులు తనను శారీరకంగా మానసికంగా హింసించారన్నారు. తన మొబైల్‌, వాచ్‌ లాగేసుకున్నారన్నారు. తనను ఎన్‌కౌంటర్‌ చేయాలని పథకం వేశారన్నారు. వారికి ప్రతి పదినిమిషాలకోసారి పోలీసులకు ఫోన్‌లు వస్తున్నాయని, ఎవరు మార్గదర్శకం చేస్తున్నారో తెలియదని, తన కుటుంబసభ్యులకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. సువర్ణసౌధలో తాను మంత్రి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు.


కానీ సువర్ణసౌధలో మూడుసార్లు దాడి చేసినా ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదన్నారు. ఓ ప్రజాప్రతినిధిగా తన పట్ల అనుచితంగా వ్యవహరించారన్నారు. ప్రతిపక్షనేతలు అశోక్‌, ఛలవాది నారాయణస్వామిలు తనను చూసేందుకు వస్తే రెండున్నరగంటలపాటు అవకాశం ఇవ్వలేదన్నారు. గురువారం మధ్యాహ్నం కారిడార్‌లో చిక్కమగళూరుకు నీ శవమే పోతుందని మంత్రి బెదరించారన్నారు.


నిజంగా నాకు ప్రాణహాని ఉందని భయపడ్డానన్నారు. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టారని, చివరకు సవదత్తి సమీపంలోని క్రషర్‌ ఫ్యాక్టరీ వద్దకు తీసుకెళ్లి ఎఫ్‌ఐఆర్‌ కాపీని పదినిమిషాలు చూపి లాగేసుకున్నారన్నారు. సీటీ రవి అరెస్టును ఖండిస్తూ అభిమానులు, కార్యకర్తలు చిక్కమగళూరులో బంద్‌ పాటించారు. బెళగావిలో ప్రతిపక్షనేత ఆద్వర్యంలో నిరసన తెలపగా బెంగళూరు ఫ్రీడంపార్కులో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు.


ఈవార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్

ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు

ఈవార్తను కూడా చదవండి: కాకినాడ పోర్టు కేంద్రంగా డ్రగ్స్.. దాని విలువ ఎంతో తెలిస్తే మతిపోతుంది

ఈవార్తను కూడా చదవండి: ఒక్కనాడైనా జై తెలంగాణ అన్నావా.. రేవంత్‌‌పై హరీష్ విసుర్లు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 21 , 2024 | 11:41 AM