ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కంగనా... నోరు జారొద్దు: బీజేపీ

ABN, Publish Date - Aug 27 , 2024 | 04:52 AM

రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్ఠానం తప్పు పట్టింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆమెను మందలించింది.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: రైతుల నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆ పార్టీ అధిష్ఠానం తప్పు పట్టింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆమెను మందలించింది. రైతుల నిరసనల విషయంలో ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోకపోతే దేశంలో బంగ్లాదేశ్‌ వంటి పరిస్థితులు ఏర్పడేవని ఆదివారం కంగన వ్యాఖ్యానించారు.

ఈ కుట్రలో చైనా, అమెరికా ప్రమేయం ఉందని ఆరోపించారు. కేంద్రం రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేసినపుడు అత్యాచార ఘటనలు జరిగాయని, శవాలు చెట్లకు వేలాడాయన్నారు.

దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో సోమవారం బీజేపీ స్పందించింది. ఆమె వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసింది. పార్టీ తరఫున విధాన పరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనకు లేదంది. కంగన వ్యాఖ్యలు రైతులను తీవ్రంగా అవమానించేలా ఉన్నాయని, రైతు వ్యతిరేకతే మోదీ ప్రభుత్వ డీఎన్‌యే అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్‌ విమర్శించారు.

Updated Date - Aug 27 , 2024 | 05:35 AM

Advertising
Advertising
<