RSS : ఆ పార్టీతో పొత్తే బీజేపీ కొంప ముంచింది... ఆర్ఎస్ఎస్ పత్రిక ఘాటు విశ్లేషణ
ABN, Publish Date - Jul 17 , 2024 | 09:15 PM
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర నుంచి బీజేపీ సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్‌సీపీతో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' ఒక రిపోర్ట్‌లో తెలిపింది.
ముంబై: లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్ర (Maharashtra) నుంచి బీజేపీ (BJP) సీట్లు దారుణంగా పడిపోవడానికి అజిత్ పవార్ ఎన్‌సీపీ (NCP)తో కమలనాథులు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడమే కారణమా?. అవునని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) అనుంబంధ మరాఠీ వీక్లీ 'వివేక్' (Vivek) ఒక రిపోర్ట్‌లో తెలిపింది. ఎన్సీపీ అజిత్ పవార్ వర్గంతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంపై రాష్ట్ర బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి ఉందని పేర్కొంది. ముంబై, కొంకణ్, వెస్ట్రన్ మహారాష్ట్రలో సుమారు 200 మందిని 'వివేక్' వీక్లే సర్వే చేసింది.
మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాలకు 2019లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 23 స్థానాలు గెలుచుకోగా, 2024 ఎన్నికల్లో ఆ సంఖ్య 9కి పడిపోయింది. కొద్దికాలం క్రితం శరద్ పవార్ ఎన్‌సీపీలో చీలిక తెచ్చి బీజేపీలో చేరిన అజిత్ పవార్ ఎన్‌సీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. తమదే నిజమైన ఎన్‌సీపీగా అజిత్ పవార్ వర్గం క్లెయిమ్ చేయడంతో గత ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ కూడా అజిత్ వర్గానిదే నిజమైన ఎన్‌సీపీగా గుర్తించింది. అనంతరం వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో ఎన్సీపీ, ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఎన్‌సీపీ కేవలం ఒకే సీటు గెలుచుకోగా, షిండే శివసేన 7 సీట్లు దక్కించుకుంది. విపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) 30 సీట్లతో అధిపత్యం చాటుకుంది. కూటమిలోని కాంగ్రెస్ 13, శివసేన (యూబీటీ) తొమ్మిది, ఎన్‌సీపీ (ఎస్‌పీ) 7 సీట్లు గెలుచుకున్నాయి.
Karnataka: ప్రైవేటు కంపెనీల్లో రిజర్వేషన్లు... పోస్ట్ డిలీట్ చేసిన సీఎం
కాగా, ఎన్సీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకి వ్యతిరేకంగా సెంటిమెంట్ బలపడిందని, ఎన్సీపీ కారణంగా రాజకీయ లెక్కలు తలకిందులైతే బీజేపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తిందని 'వివేక్' వీక్లీ విశ్లేషించింది. ఇతర పార్టీల నేతను చేర్చుకోవడం ద్వారా సొంత సంస్థలో ప్రతిభకు పట్టం కట్టే సంప్రదాయానికి బీజేపీ పక్కనపెట్టడం ఆందోళనకరమని తెలిపింది. బీజేపీ కార్యకర్తలకు విధాన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో భాగస్వామ్యం కల్పించడం వల్లే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఆ పార్టీ 29 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న వైనాన్ని ఉదహరించింది.
For Latest News and National News click here
Updated Date - Jul 17 , 2024 | 09:19 PM