ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆపార్టీ ఓ ఆరిపోయే దీపం..!

ABN, Publish Date - Apr 09 , 2024 | 11:41 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఎందుకనో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ పార్టీ ఆరిపోయే దీపమని, కనుకనే ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పెద్ద వెలుగు ప్రసరిస్తున్నట్లు ప్రజలకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

చెన్నై: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కి ఎందుకనో ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేపై ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆ పార్టీ ఆరిపోయే దీపమని, కనుకనే ఈ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పెద్ద వెలుగు ప్రసరిస్తున్నట్లు ప్రజలకు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో మక్కల్‌ నీదిమయ్యం నాయకుడు కమల్‌ ఎన్డీయేపై అవాకులుచెవాకులు పేలుతున్నారని, వీలయినంత త్వరగా ఆయన మెదడును పరీక్షించుకుంటే మంచిదంటూ చురక అంటించారు. కోయంబత్తూరు శరవణపట్టిలో సోమవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... తాంబరం వద్ద పట్టుబడిన నగదుకు తనకు సంబంధం లేదని బీజేపీ శాసనసభ్యుడు నయినార్‌ నాగేంద్రన్‌ స్పష్టం చేశారని, ఆ నగదు స్వాధీనంపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కోయంబత్తూరులో అంతర్జాతీయ క్రీడా మైదానం ఏర్పాటు చేస్తానని ముఖ్యమంత్రి స్టాలిన్‌ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రానికి నాలుగు అంతర్జాతీయ స్థాయి క్రీడామైదానాలు అవసరమని అన్నారు. బీజేపీ రాష్ట్ర శాఖకు సమర్థుడైన నాయకుడు లేడని, అన్నామలై రెడీమేడ్‌ నాయకుడని అన్నాడీఎంకే మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్‌ చేసిన విమర్శపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూన్‌ నాలుగు తర్వాత ఆ పార్టీ ఏమవుతుందో ఓపిక పట్టండి, ఆరిపోయే దీపం కదా అందుకే ఇంత వెలుగు అని ఎద్దేవా చేశారు. శ్రీపెరుంబుదూరు డీఎంకే అభ్యర్థి టీఆర్‌ బాలుకు మద్దతుగా ప్రచారం చేస్తూ కమల్‌ బీజేపీ మూడోసారి అధికారం ఇస్తే నాగ్‌పూర్‌ దేశ రాజధాని అవుతుందని, ఏకమతం కలిగిన దేశంగా మారుతుందని విమర్శించడంపై కూడా అన్నామలై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి: Mansoor Ali Khan: ఆపార్టీ నేతల వద్ద డబ్బు తీసుకోండి.. ఓటర్లకు మన్సూర్‌ అలీఖాన్‌ పిలుపు

Updated Date - Apr 09 , 2024 | 11:41 AM

Advertising
Advertising