Karnataka: మా ఇంటి బోరు నుంచి నీరు రావడం లేదు: డీకే శివకుమార్
ABN, Publish Date - Mar 06 , 2024 | 10:30 AM
బెంగళూర్ నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. నగరంలో గల అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్ల నుంచి నీరు రావడం లేదు. గత కొన్నిరోజుల నుంచి ఈ సమస్య ఉంది. నిత్యవసర అవసరం అయిన నీటిని కొందరు వ్యాపారంగా మారుస్తున్నారు. ట్యాంకర్ల ద్వారా నీరు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఇదే అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు.
బెంగళూర్: బెంగళూర్ (Bengaluru) నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. నగరంలో గల అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్ల నుంచి నీరు రావడం లేదు. గత కొన్నిరోజుల నుంచి సమస్య ఏర్పడింది. నిత్యవసర అవసరం అయిన నీటిని కొందరు వ్యాపారంగా మారుస్తున్నారు. ట్యాంకర్ల (Tankers) ద్వారా నీరు తరలిస్తూ దోచుకుంటున్నారు. ఇదే అంశంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మాట్లాడారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నగర ప్రజలకు నీరు అందజేస్తామని స్పష్టం చేశారు. నగరంలో నీటి సమస్య ఉంది.. మా ఇంటిలో ఉన్న బోరు నుంచి కూడా నీరు రావడం లేదని డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
ఒక్కో ట్యాంకర్ రూ.3 వేలు
వర్షాభావ పరిస్థితుల ప్రభావం బెంగళూర్ నగరంపై పడింది. బోర్ల నుంచి నీరు రావడం లేదు. తమ అవసరాల కోసం ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని రెసిడెన్షియల్ సొసైటీలు కోరుతున్నాయి. బెంగళూర్‌లో నీటి కొరతను కొందరు క్యాష్ చేసుకుంటున్నారు. ‘కొన్ని ట్యాంకర్ల రూ.600కు నీటి సరఫరా చేస్తున్నారు. మరికొందరు రూ.3 వేలకు విక్రయిస్తున్నారు. నీటిని సరఫరా చేసే వాటర్ ట్యాంకర్లు అధికారుల వద్ద తమ పేర్లను రిజిష్టర్ చేసుకోవాలి. నీటిని తీసుకొచ్చే దూరాన్ని బట్టి ధర నిర్ణయించాలి అని’ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
అంతా మీరే చేశారు
బెంగళూర్‌లో నీటి ఎద్దడికి కేంద్ర ప్రభుత్వం కారణం అని డీకే శివకుమార్ మండిపడ్డారు. ‘బెంగళూర్ నగరానికి నీరు అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టును ప్రారంభించాం. ఆ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అడ్డు తగిలింది. దాంతో బెంగళూర్ ప్రజలకు నీటి కష్టాలు ప్రారంభం అయ్యాయి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి అని’ డీకే శివకుమార్ కోరారు.
ఇది కూడా చదవండి: Delhi: డీకే శివకుమార్‌కు ఊరట.. మనీ ల్యాండరింగ్ కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
15 కి.మీ దూరం నుంచి
బెంగళూర్‌లో నీటి సమస్య నేపథ్యంలో సిటీకి 15 కిలోమీటర్ల పరిధిలో గల నీటి వనసరులను తీసుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ఆ దేశాలు జారీచేశారు. బెంగళూర్ శివారులో ఉన్న రామనగర, హొస్కొట్, చెన్నపట్న, మగాడి, ఇతర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తరలించాలని స్పష్టం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 06 , 2024 | 10:30 AM