సంపదలో రాజును మించిన సునాక్ దంపతులు!
ABN , Publish Date - May 20 , 2024 | 05:13 AM
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సతీమణి అక్షతా మూర్తి సంపదలో ఆ దేశ రాజు చార్లె్‌స-3ను అధిగమించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల నికర సంపద ఆధారంగా సండే టైమ్స్ వార్తా పత్రిక ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది. గతేడాది ఇందులో 275వ స్థానంలో నిలిచిన సునాక్ దంపతులు.. ఈసారి 245వ స్థానానికి ఎగబాకారు.
యూకే ప్రధాని దంపతుల ఆస్తులు రూ.6,867 కోట్లు
లండన్, మే 19: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, సతీమణి అక్షతా మూర్తి సంపదలో ఆ దేశ రాజు చార్లె్‌స-3ను అధిగమించారు. బ్రిటన్‌లో నివసిస్తున్న తొలి వెయ్యి మంది సంపన్నులు/కుటుంబాల నికర సంపద ఆధారంగా సండే టైమ్స్ వార్తా పత్రిక ధనవంతుల జాబితాను తాజాగా విడుదల చేసింది.
గతేడాది ఇందులో 275వ స్థానంలో నిలిచిన సునాక్ దంపతులు.. ఈసారి 245వ స్థానానికి ఎగబాకారు. ఇక కింగ్ చార్లెస్ మాత్రం తాజా జాబితాలో 258వ స్థానంలో నిలవడం గమనార్హం. 2023లో సునాక్ దంపతుల సంపద 529 మిలియన్ పౌండ్లు ఉండగా.. ఏడాదిలో 651 మిలియన్ పౌండ్ల (రూ.6,867 కోట్లు)కు పెరిగింది. అదే చార్లెస్-3 సంపద 600 మిలియన్ పౌండ్ల నుంచి 610 మిలియన్ పౌండ్ల (రూ.6,435 కోట్ల)కు మాత్రమే పెరిగింది.
ప్రస్తుత ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో బ్రిటన్‌లోని బిలియనీర్ల ఆస్తులు కరిగిపోతున్నాయి. అయితే తండ్రి నారాయణమూర్తి భారత కంపెనీ ఇన్ఫోసి్‌సలో అక్షతా మూర్తికి అధిక షేర్లు ఉన్న నేపథ్యంలోనే వారి సంపద గణనీయంగా పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఇక సంపన్నుల జాబితాలో భారత్‌కు చెందిన హిందుజా గ్రూప్‌ను పర్యవేక్షిస్తున్న గోపి హిందుజా కుటుంబం 37.2 బిలియన్ పౌండ్లతో అగ్రస్థానంలో నిలిచింది.