Election Commission: మళ్లీ మోగిన నగారా.. జులై 10న ఎన్నికలు
ABN, Publish Date - Jun 10 , 2024 | 02:36 PM
దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ, జూన్ 10: దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) సోమవారం న్యూఢిల్లీలో విడుదల చేసింది. జూలై 10వ తేదీన ఈ ఉప ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది. జూన్ 14వ తేదీన ఈ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపింది. ఇక అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు చివర తేదీ జూన్ 21వ తేదీగా నిర్ణయించినట్లు పేర్కొంది. జూన్ 24వ తేదీ నామినేషన్ పత్రాలు పరిశీలనకు చివర తేదీ అని చెప్పింది. జులై 13వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించింది.
Also Read: Modi 3.0: ఇంతకీ లోక్‌సభ స్పీకర్ ఎవరు?
బిహార్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లోని అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక జరగనుందని వివరించింది. ఆ యా రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేయడం.. పలువురు ఎమ్మెల్యేలు మృతి చెందడంతో.. సదరు అసెంబ్లీ స్థానాలకు ఖాళీ ఏర్పడిందని... దీంతో ఉప ఎన్నిక అనివార్యమైందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
ఇప్పటికే దేశ్యవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతోపాటు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ సార్వత్రిక ఎన్నికలు దేశవ్యాప్తంగా మొత్తం 7 దశల్లో జరిగాయి. అంటే ఏప్రిల్ 19న తొలి దశలో ప్రారంభమై.. జూన్ 1వ తేదీతో తుది దశతో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీ జరిగింది. ఈ మొత్తం ఎన్నికల క్రతువు కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో పకడ్బందీ ఏర్పాట్ల మధ్య జరిగింది. ఆ ఎన్నికలు పూర్తి అయిన పదిరోజుల్లోనే మళ్లీ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికకు సీఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.
Read More National News and Latest Telugu News
Updated Date - Jun 10 , 2024 | 02:39 PM