ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Nirmala Sitharaman: దేశ ఆర్థిక మంత్రికి అప్పులు.. సీతారామన్ మొత్తం ఆస్తి ఎంతో తెలుసా..!

ABN, Publish Date - Mar 29 , 2024 | 05:34 PM

తన వద్ద డబ్బులు లేకపోవడం వలన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానమైన అంశంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) సైతం డబ్బులు లేకపోవడం వలనే తాను నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పారు.

తన వద్ద డబ్బులు లేకపోవడం వలన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నానని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ (Nirmala Sitharaman) చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఎన్నికల్లో పోటీ చేయాలంటే డబ్బే ప్రధానమైన అంశంగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేయగా.. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందర్ రాజన్ (Tamilisai Soundararajan) సైతం డబ్బులు లేకపోవడం వలనే తాను నాలుగు సార్లు ఎన్నికల్లో ఓడిపోయానని చెప్పారు. దీంతో నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. దీనికి తోడు అసలు నిర్మలా సీతారామన్ ఆస్తుల విలువ ఎంత అంటూ నెటిజన్లు గూగుల్ సెర్చ్ చేస్తున్నారు. అలాగే 2022లో రాజ్యసభ సభ్యురాలిగా నామినేషన్ వేసిన సమయంలో ఆమె దాఖలు చేసిన అఫిడవిట్లను ఎక్కువ మంది సెర్చ్ చేస్తున్నారు. అసలు కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ ఆస్తులు ఎంత.. ఆమెకు ఉన్న అప్పులెంతో తెలుసుకుందాం.

Lok Sabha Elections 2024: ఎన్నికల్లో పోటీపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసిన నిర్మలా సీతారామన్

ఆస్తుల విలువ..

సాధారణంగా ఓసారి ఎమ్మెల్యేగా పని చేస్తే కోట్ల రూపాయిలు వెనకేసుకునే నాయకులను చూశాం. నిర్మలా సీతారామన్ 2014 నుంచి కేంద్రమంత్రిగా ఉన్నారు. గతంలో రక్షణ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రస్తుతం ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. దేశ బడ్జెట్ మొత్తం నిర్మలా చూస్తారు. కాని అలాంటి నిర్మలా సీతారామన్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటనే అనుమానం చాలా మందికి వస్తుంది. కాని అదే నిజం ఆమె అఫిడవిట్లు చూసినా, బ్యాంకు అకౌంట్లు చూసినా అసలు విషయం అర్థమవుతుంది. నిర్మలా సీతారామన్ మొత్తం ఆస్తి దాదాపు రూ.2.53 కోట్లు మాత్రమే. ఆమె నివాస భవనం, స్థలం, బంగారంతో పాటు ఆమె దగ్గరున్న స్థిర, చర ఆస్తుల విలువ కేవలం రూ.2.53 కోట్లు. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రికి అప్పులు కూడా ఉన్నాయి. ఆమెకు దాదాపు రూ.26.91 లక్షల అప్పు ఉంది. ఇది 2022 లెక్క. ఈ రెండేళ్లలో స్వల్పంగా వీటి సంఖ్య మారి ఉండొచ్చు. వాయిదాల పద్దతిలో అప్పు చెల్లించడం లేదా కొత్త అప్పులు చేసి ఉంటే ఈ మొత్తంలో కొంతమేర మార్పు ఉండి ఉండొచ్చు. హైదరాబాద్ సమీపంలోని మంచిరేవులలో ఆమెకు నివాస భవనం ఉంది. 2016లో దీని విలువ రూ. 99.36 లక్షలు కాగా.. 2022 నాటికి ఈ భవనం విలువ రూ. 1.7 కోట్లకు పెరిగింది. అలాగే కుంట్లూర్‌లో రూ. 17.08 లక్షల విలువైన వ్యవసాయేతర భూమిని సీతారామన్ కలిగి ఉన్నారు. 2016లో దీని విలువ రూ.16.02 లక్షలు.

2022 అఫిడవిట్ ప్రకారం నిర్మలా సీతారామన్ వద్ద ఒక స్కూటర్ ఉంది. ఆమెకు సొంతంగా కారు లేదు. 2016లో నిర్మలా వద్ద ఉన్న బంగారం 315 గ్రాములు కాగా.. దాని విలువ రూ.7.87 లక్షలని ఆమె ప్రకటించారు. 2022 డిక్లరేషన్‌లో బంగారం పరిమాణంలో ఎటువంటి మార్పులేదు. అయితే బంగారం విలువ రెట్టింపు అయి రూ.14.49 లక్షలకు చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్ ధర ప్రకారం ఆమె వద్ద ఉన్న 315 గ్రాముల బంగారం ధర రూ.19.4 లక్షలు.

హోమ్ లోన్..

నిర్మలా సీతారామన్ తన పొదుపును మ్యూచువల్ ఫండ్స్ కింద మార్చారు. రూ. 5.80 లక్షల రూపాయిల విలువైన మ్యూచువల్ ఫండ్స్ ఆమె కలిగి ఉన్నారు. 2022 అఫిడవిట్ ప్రకారం ఆమె వద్ద ఉన్న నగదు కేవలం రూ.7,350 మాత్రమే. గృహం రుణంపై రుణం కలిగి ఉండగా.. దానిని ఆమె చెల్లిస్తున్నారు. సిండికేట్ బ్యాంకులో ఆమె రుణం తీసుకోగా.. బ్యాంకుల విలీనం తర్వాత ఆ రుణం కెనరా బ్యాంక్‌కు బదిలీ అయింది. 2016లో ఇంటిపై రుణం రూ. 7.02 లక్షలు కాగా.. 2022లో ఆ రుణం రూ.5.44 లక్షలకు తగ్గింది. 2016లో రూ. 5.03 లక్షల అప్పులు ఉండగా.. అది 2022 నాటికి రూ. 2.53 లక్షలకు తగ్గింది. మొత్తానికి కేంద్ర ఆర్థిక మంత్రి ఆస్తుల విలువ దాదాపు రూ.2.53 కోట్లు మాత్రమేనని తేలింది.

Elections 2024: ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు.. ఇప్పటి వరకు ఎన్ని ఫిర్యాదులు అందాయంటే..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 29 , 2024 | 05:34 PM

Advertising
Advertising