Delhi : ‘సంఘ్’లో ప్రభుత్వ ఉద్యోగులపై నిషేధం ఎత్తివేత
ABN, Publish Date - Jul 23 , 2024 | 03:18 AM
ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా 1966లో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ నెల 9న ఈ ఉత్తర్వులిచ్చినట్లు బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్ మాలవీయ సోమవారం ‘ఎక్స్’లో తెలిపారు.
న్యూఢిల్లీ, జూలై 22: ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్ కార్యకలాపాల్లో పాల్గొనకుండా 1966లో విధించిన నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఈ నెల 9న ఈ ఉత్తర్వులిచ్చినట్లు బీజేపీ ఐటీ విభాగం ఇన్‌చార్జి అమిత్ మాలవీయ సోమవారం ‘ఎక్స్’లో తెలిపారు. అసలు నిషేధమే విధించి ఉండాల్సింది కాదని, 58 ఏళ్లనాటి ఈ ఉత్తర్వులు రాజ్యాంగవిరుద్ధమని, వాటిని మోదీ సర్కారు ఎత్తివేసిందని వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు నిర్ణయంపై విపక్షాలు మండిపడ్డాయి.
ఇది దురదృష్టకర నిర్ణయమని.. ప్రజాతీర్పు నుంచి బీజేపీ ప్రభుత్వం పాఠాలు నేర్వడం లేదని కాంగ్రెస్ విమర్శించింది. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు కూడా ఈ నిషేధాన్ని పొడిగించారని.. సంఘ్‌తో దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించుకునేందుకే ప్రధాని మోదీ దానిని ఎత్తివేశారని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ‘ఎక్స్’లో ధ్వజమెత్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు నిక్కర్లు వేసుకుని ఆఫీసులకు వస్తారని ఎద్దేవాచేశారు.
Updated Date - Jul 23 , 2024 | 03:18 AM