ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Budget : పట్టణాలకు మహర్దశ!

ABN, Publish Date - Jul 24 , 2024 | 06:08 AM

పట్టణాలకు బడ్జెట్‌లో కేంద్రం మహర్దశ పట్టించింది. 2014-25 బడ్జెట్‌ తొమ్మిది ప్రాధామ్యాల్లో ఒకటిగా పట్టణాభివృద్ధిని కేంద్రం ప్రకటించింది. అందుకు తగినట్టే.. పట్టణ గృహస్థులపై వరాలవర్షం కురిపించింది.

  • పట్టణవాసులపై వరాలవర్షం

  • బడ్జెట్‌ 9 ప్రాధామ్యాల్లో పట్టణానికీ చోటు

  • అదనంగా మూడు కోట్ల ఇళ్లు మంజూరు

  • ఐదేళ్లలో రూ.10లక్షల కోట్లతో నిర్మాణం

  • అందుబాటు అద్దెతో బాడుగ ఇళ్లు

న్యూఢిల్లీ, జూలై 23: పట్టణాలకు బడ్జెట్‌లో కేంద్రం మహర్దశ పట్టించింది. 2014-25 బడ్జెట్‌ తొమ్మిది ప్రాధామ్యాల్లో ఒకటిగా పట్టణాభివృద్ధిని కేంద్రం ప్రకటించింది. అందుకు తగినట్టే.. పట్టణ గృహస్థులపై వరాలవర్షం కురిపించింది. అధిక జనాభా నివసించే రద్దీ నగరాల కు రవాణా అనేది పెద్ద సంకటం. దీంతో అతి పెద్ద నగరాలను రవాణాపరంగా పరుగులు పెట్టించాలని కేంద్రం నిర్ణయించింది. 30 లక్షలకుపైగా జనాభా కలిగిన నగరాలను దీనికోసం ఎంపిక చేస్తారు. వాటిలోంచి 14 సిటీలను ఎంపిక చేసుకుని వాటికి రవాణా హంగు లు అద్దుతారు. గ్రోత్‌ హబ్‌లుగానూ ఈ నగరాల ను తీర్చిదిద్దుతారు.

టౌన్‌ ప్లానింగ్‌ పథకాలను పట్టణ పొలిమేర ప్రాంతాల అభివృద్ధికి సద్వినియోగం చేసుకుంటామని కూడా కేంద్రం పేర్కొంది. అలాగే, అదనంగా మూడుకోట్ల పట్టణ గృహాల ను వచ్చే ఐదేళ్లలో నిర్మిస్తామని తెలిపింది. దీనికోసం బడ్జెట్‌లో రూ.10 లక్షల కోట్లను ప్రతిపాదించింది. ప ట్టణాల్లో గృహ నిర్మాణం కోసం ప్రజ లు వడ్డీ రాయితీపై తీసుకునే రుణాల రేటు హేతుబద్ధంగా ఉండేలా చూస్తామని తెలిపింది.

అందరికీ అద్దె నివాసాలు సమకూరేలా, వాటిపై వసూలు చేస్తున్న బాడుగను ఖరారు చేస్తామని బడ్జెట్‌లో తెలిపారు. పారిశ్రామిక కూలీలు తలదాచుకునే డార్మెటరీలను పీపీపీ (పబ్లిక్‌, ప్రైవేట్‌ భాగస్వామ్యం) పద్ధతిలో మరిన్ని నిర్మిస్తామని పేర్కొన్నారు. అలాగే, వారాంతాల్లో ప్రజల అల్పాహార అవసరాలను తీర్చేలా ఒక వంద వీక్లీ స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌లను ఎంపిక చేసిన నగరాల్లో నెలకొల్పుతామని వెల్లడించా రు.

పట్టణాలకు నీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణకు బడ్జెట్‌లో నిర్దిష్ట కార్యాచరణను ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వాలు, బహుళ అభివృద్ధి బ్యాంకుల సాయంతో దీనిపై బృహత్తర ప్రాజెక్టులను చేపడతామని హామీ ఇచ్చారు. బ్యాంకులు కేంద్రంగా వంద పెద్ద నగరాల్లో వీటిని నెలకొల్పుతామని తెలిపారు.


భూరికార్డుల డిజిటలైజేషన్‌కు ఊపు

బడ్జెట్‌లో నిర్దేశించిన 9 ప్రాధామ్యాల్లో పట్టణాభివృద్ధి ఒకటి అని కేంద్రం స్పష్టం చేసింది. పట్టణ ప్రజల సొంతింటి కలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని భరోసా ఇచ్చింది. ఈ క్రమంలో ఎదురయ్యే అన్ని సవాళ్లను అధిమిస్తామని పేర్కొంది. భూసంబంధ సంస్కరణల్లో భాగంగా పట్టణ భూరికార్డులకు జీఐఎస్‌ మ్యా పింగ్‌ విధానంలో డిజిటలైజేషన్‌ చేపడతామని తెలి పింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన కింద అదనంగా మూడు కోట్ల గృహాలను రూ.10 లక్షల కోట్ల అంచనాతో నిర్మిస్తామని తెలిపింది. బ్యాంకులకు తలనొప్పిగా మారిన రుణాల ఎగవేత సమస్యను నియంత్రించడా నికి దేశవ్యాప్తంగా కొత్తగా మరికొన్ని ట్రైబ్యునళ్లను ఏర్పాటు చేస్తామని బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించింది.

మహిళలు కొనే ఆస్తులపై అత్యల్ప స్టాంప్‌ డ్యూటీ

కొన్ని రాష్ట్రాలు ఆస్తుల కొనుగోలుపై భారీ స్టాంప్‌ డ్యూటీ వేస్తున్నాయని కేంద్రం తెలిపింది. ఆ డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సవరిస్తామని పేర్కొంది. ముఖ్యంగా, మహిళలు కొనుగోలు చేసే ఆస్తులపై అతి తక్కువ స్టాంప్‌ డ్యూటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది. పట్టణ అభివృద్ధి స్కీమ్‌ల్లో ఈ ప్రతిపాదనకు పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చింది. దీనివల్ల పట్టణాల్లో ఆస్తుల కొనుగోలు ధర పడిపోతుందని ‘కొలియర్స్‌ ఇండియా’ అనే గృహ సేవలు అందించే సంస్థ ఎండీ రవిశంకర్‌ సింగ్‌ అభిప్రాయపడ్డారు. కాగా, గ్రామీణ ప్రాంతాల్లో ‘భూ ఆధార్‌’ ప్రక్రియ కు విశిష్ఠ సంఖ్యను కేటాయించే ప్రతిపాదన ఉన్నదని కేంద్రం తెలిపింది.

Updated Date - Jul 24 , 2024 | 06:10 AM

Advertising
Advertising
<