ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Centre Moves SC: సీఐఎస్ఎస్ సిబ్బంది మోహరింపు.. బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టుకు కేంద్రం

ABN, Publish Date - Sep 03 , 2024 | 08:39 PM

ఆర్జీ కర్ ఆసుపత్రి వద్ద విధుల నిర్వహణలో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందికి బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదంటూ సుప్రీంకోర్టును కేంద్రం ఆశ్రయించింది.

న్యూఢిల్లీ: కోల్‌కతా ఆర్జీ కర్ ఆసుపత్రిలో సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బంది మోహరింపు విషయంలో బెంగాల్ సర్కార్‌పై సుప్రీంకోర్టు (Supreme Court)లో కేంద్రం మంగళవారంనాడు పిటిషన్ దాఖలు చేసింది. విధుల నిర్వహణలో ఉన్న సీఐఎస్ఎఫ్ సిబ్బంది వసతి, భద్రతా పరికరాల నిర్వహణ, రవాణా సౌకర్యాల లేమితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించడం లేదనడానికి ఇదొక ఉదాహరణ అని కోర్టు దృష్టికి తెచ్చింది. సీఏఎస్‌ సిబ్బందికి పూర్తి సహకారం అందించేలా పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని, ఆ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా పాటించని పక్షంలో కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పాలని విజ్ఞప్తి చేసింది.


ఆర్జీ కర్ ఆసుపత్రిపై ఆగస్టు 14-15 తేదీల్లో కొందరు అల్లరిమూక దాడికి దిగారు. ఆగస్టు 9వ తేదీన 31 ఏళ్ల ట్రెయినీ వైద్యురాలు అత్యాచారం, హత్యకు గురికావడంతో అల్లరిమూక ఈ విధ్వంసం సృష్టించింది. ఈ దాడిలో ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, నర్సింగ్ స్టేషన్, మెడికల్ స్టోర్‌తో పాటు సీసీటీవీ కెమెరాలు దెబ్బతిన్నాయి. దీంతో కేంద్ర బలగాలతో ఆసుపత్రికి రక్షణ కల్పించాలని ఆగస్టు 20న బెంగాల్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.


Read More National News and Latest Telugu New

Also Read: Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి

Also Read:RG Kar hospital: 8 రోజుల సీబీఐ కస్టడీకి ప్రొ. సందీప్ ఘోష్

Updated Date - Sep 03 , 2024 | 08:41 PM

Advertising
Advertising