Chennai: ‘ఫెంగల్’ నష్టంపై ప్రధాని మోదీ ఆరా.. సీఎం స్టాలిన్‌కు ఫోన్
ABN, Publish Date - Dec 04 , 2024 | 10:52 AM
ఇటీవల సంభవించిన ఫెంగల్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అపారనష్టం వాటిల్లింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు ఫోన్ చేసి ఆరా తీశారు.
చెన్నై: ఇటీవల సంభవించిన ఫెంగల్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో అపారనష్టం వాటిల్లింది. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) మంగళవారం ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin)కు ఫోన్ చేసి ఆరా తీశారు. తుఫాను బాధిత జిల్లాల్లో జరిగిన నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు సీఎంకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ఈ వార్తను కూడా చదవండి: Fenugreek effect: ప్రజలకు కోపం వస్తే ఇలాగే ఉంటది మరి.. మంత్రిపై బురద చల్లిన ‘వరద’ బాధితులు..
ఇదిలావుంటే, ప్రధాని మోదీ ఫోన్ చేసిన విషయంపై ముఖ్యమంత్రి స్టాలిన్ తన ఎక్స్ పేజీలో ట్వీట్ చేశారు. ఫెంగల్ తుఫాన్ సృష్టించిన నష్టంపై ప్రధాని మోదీ ఫోన్ చేసారని చెప్పారు. ఈ సందర్భంగా తుఫాను ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరించినట్టు తెలిపారు. అంతేకాకుండా, ప్రకృతి వైపరీత్యం వలన కలిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని తక్షణం రాష్ట్రానికి పంపించాలని, వరద బాధితులను ఆదుకునేందుకు తక్షణ సాయం అందజేయాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు.
తుఫాను ప్రాంతాల్లో తక్షణ సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలైన సహాయ సహకారాలు అందిస్తుందని భావిస్తున్నట్టు సీఎం స్టాలిన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News
Updated Date - Dec 04 , 2024 | 10:52 AM