Share News

CJI Chandrachud : సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్‌ అదాలత్‌

ABN , Publish Date - Jul 30 , 2024 | 03:08 AM

పెండింగ్‌ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌ కార్యక్రమం సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభమయింది.

CJI Chandrachud : సుప్రీంకోర్టులో ప్రత్యేక లోక్‌ అదాలత్‌

న్యూఢిల్లీ, జూలై 29: పెండింగ్‌ కేసులను రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడానికి ఉద్దేశించిన ప్రత్యేక లోక్‌ అదాలత్‌ కార్యక్రమం సోమవారం సుప్రీంకోర్టులో ప్రారంభమయింది.

సర్వోన్నత న్యాయస్థానంలోని తొలి ఏడు ధర్మాసనాలు ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. తొలిసారిగా కోర్టు రూముల్లోకి మీడియాను, కెమేరాలను అనుమతించారు.

సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 3వరకు వారం రోజుల పాటు ఈ ప్రత్యేక లోక్‌ అదాలత్‌ను నిర్వహించనున్నట్టు సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రకటించారు.

న్యాయసమస్యలకు సత్వర పరిష్కారం కోసం లోక్‌ అదాలత్‌ సౌకర్యాన్ని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. కుటుంబ సమస్యలు, ఆస్తుల వివాదాలు వంటి కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు.

Updated Date - Jul 30 , 2024 | 03:08 AM