లేబర్‌పార్టీ మేనిఫెస్టోలో మా స్కీములు.. అందుకే విజయం: స్టాలిన్
ABN, Publish Date - Jul 07 , 2024 | 03:30 AM
తన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గత మూడేళ్లుగా అమలు చేస్తున్న మూడు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వల్లనే ఇంగ్లాండులో లేబర్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
చెన్నై, జూలై 6 (ఆంధ్రజ్యోతి): తన నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం గత మూడేళ్లుగా అమలు చేస్తున్న మూడు పథకాలను ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చడం వల్లనే ఇంగ్లాండులో లేబర్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. ప్రభుత్వ బడుల్లో 1-5వ తరగతి దాకా చదివే పిల్లలకు ‘సీఎం అల్పాహార పథకం’, ప్లస్-2 (12వ తరగతి) చదివే విద్యార్థులకు ప్రతిభాపాటవాలపై శిక్షణలందించే ‘నాన్ ముదల్వన్ పథకం’, నిరుపేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చే ‘కలైంజర్ కనవు ఇల్ల దిట్టమ్’ (కలైంజర్ డ్రీమ్ హౌస్ ప్రాజెక్ట్) పథకాన్ని లేబర్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చటం వల్ల అక్కడి ప్రజాభిమానం పొందిందని అన్నారు.
Updated Date - Jul 07 , 2024 | 03:30 AM