ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nayab Singh Saini: విజయోత్సాహంతో మోదీని కలిసిన సీఎం నయబ్ సింగ్ సైనీ

ABN, Publish Date - Oct 09 , 2024 | 03:31 PM

ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మోదీ నాయకత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంపై హర్యానా సీఎం నయబ్ సింగ్ సైనీ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.

న్యూఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో (Haryana Assembly Elections) బీజేపీ ఘన విజయం సాధించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ (Nayab Singh Saini) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)ని ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారంనాడు కలుసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ మోదీ నాయకత్వంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సాధించడంపై ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టార్ కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు.

Haryana Results: హర్యానా ఓటమిపై రాహుల్ తొలి స్పందనిదే


హర్యానాలో బీజేపీ ఘన విజయం మోదీకి దక్కుతుందని, గత పదేళ్లలో ప్రధాని విధానాలు, పథకాలతో పేదలు, యువకులు, మహిళలు ఎంతో లబ్ధి పొందారని ప్రధానితో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ సైని అన్నారు. సమాజంలోని ప్రతి ఒక్క వర్గానికి మోదీ పథకాలు అందుతున్నాయని, ఆయన పథకాలు, ఆయన పట్ల ప్రజలకున్న అపారమైన ప్రేమే ఈ విజయానికి కారణమని చెప్పారు. హర్యానా ప్రజలు, పార్టీ కోసం అహరహం కృషి చేసిన కార్యకర్తలను రుణపడి ఉంటానని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే వాతావారణాన్ని కొందరు సృష్టించారని, అయితే మోదీ నాయకత్వంలో పదేళ్లలో తాము చేసిన పనులే తమను గెలిపిస్తాయనే నాలుగు రోజుల క్రితం తాను చెప్పిన మాటలను ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా తాను చేయాల్సింది తాను చేశానని, పార్లమెంటరీ బోర్డు, ఎమ్మెల్యేలు తమ నేతలను ఎన్నుకుంటారని, పార్లమెంటరీ బోర్టు తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటారని చెప్పారు. పరిశీలకులు వస్తారని, ఏమి జరుగుతుందో చూద్దామని మరో ప్రశ్నకు సమాధానంగా సైని చెప్పారు.


అనిల్ విజ్ మా నేత

అధిష్ఠానం కోరుకుంటే తాను ముఖ్యమంత్రిని అవుతానంటూ బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ చేసిన ప్రకటనపై సైనీ మాట్లాడుతూ, అనిల్ విజయ్ తమ నేత అని, ఆయన ఏదైనా చెప్పి ఉంటే పార్టీ నేతగా చెప్పి ఉండవచ్చని అన్నారు.


For More National News and Telugu News..

ఇది కూడా చదవండి..

Exit Polls Fail: సర్వే సంస్థల అంచనాలు బోల్తా.. ప్రజల నాడి పసిగట్టడంతో విఫలం..

Updated Date - Oct 09 , 2024 | 03:36 PM