ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Lok Sabha Elections: జాతీయ భద్రతతో రాజీనా?.. దీదీపై అమిత్‌షా నిప్పులు

ABN, Publish Date - May 22 , 2024 | 04:09 PM

ఓటు బ్యాంకు కోసం జాతీయ భద్రతతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీపడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తప్పుపట్టారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతించడం ద్వారా ఆమె పాపానికి పాల్పడుతున్నారని అన్నారు.

కాంతి: ఓటు బ్యాంకు కోసం జాతీయ భద్రతతో పశ్చిమబెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) రాజీపడుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) తప్పుపట్టారు. చొరబాటుదారులను రాష్ట్రంలోకి అనుమతించడం ద్వారా ఆమె పాపానికి పాల్పడుతున్నారని అన్నారు. పశ్చిమబెంగాల్ చొరబాటుదారులకు స్వర్గధామంలా మారడం వల్ల ఆ ప్రభావం రాష్ట్రంపైనే కాకుండా యావద్దేశం పైన పడుతుందని చెప్పారు. ఈస్ట్ మిడ్నాపూర్‌లోని కాంతిలో బుధవారంనాడు జరిగిన ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, రాష్ట్రంలోని 42 లోక్‌సభ సీట్లలో 30 సీట్లు బీజేపీ గెలుచుకుంటే తృణమూల్ కాంగ్రెస్‌ బీటలు వారుతుందని, రాష్ట్రంలో మమతా బెనర్జీ పాలనను సాగనంపేందుకు ఇది సంకేతమవుతుందని అన్నారు.


ధార్మిక, సేవా సంస్థలను బెదరిస్తారా?

రామకృష్ణ మిషన్ మరియు భారత్ సేవాశ్రమ సంఘానికి చెందిన కొందరు సన్యాసులు ఢిల్లీలో బీజేపీ నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారని మమతా బెనర్జీ ఇటీవల చేసిన వ్యాఖ్యలను అమిత్‌షా తోసిపుచ్చారు. సేవకు-నైతికతకు కట్టుబడిన సంస్థలను టీఎంసీ తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బెదిరిస్తోందని అన్నారు. భారత్ సేవాశ్రమ్ సంఘ లేకుంటే బంగ్లాదేశ్‌లో ఒక భాగంగానే పశ్చిమబెంగాల్ మిగిలిపోయేదని, ఆ వాస్తవం మమతా బెనర్జీకి తెలియకపోవచ్చని అన్నారు.

Lok Sabha Elctions: ఐదు విడతల్లోనే మూడోసారి మా సర్కర్ ఖాయమైంది: మోదీ


కౌంటింగ్ తర్వాత కూడా పారామిలటరీ బలగాలు

పశ్చిమబెంగాల్‌లో రాజకీయ హింస దాదాపు ప్రజాస్వామాన్ని తుడిచిపెట్టేసిందని, పంచాయతీ ఎన్నికల్లో 200 మందిగా పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అమిత్‌షా అన్నారు. కాంతి ప్రజలు భయపడాల్సిన పనిలేదని, ఐదు విడతల పోలింగ్‌లో మమత గూండాలు ఏ ఒక్కరినీ టచ్ చేయలేకపోయారని అన్నారు. ఎన్నికల కౌంటింగ్ తర్వాతకూడా పారామిలటరీ కంపెనీలను ఇక్కడే ఉంచాలని ఈసీకి తాము విజ్ఞప్తి చేస్తామని అమిత్‌షా భరోసా ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 04:09 PM

Advertising
Advertising