ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Maharashtra Assembly elections 2024: ఎంవీఏ కూటమిలో గొడవలు..? కారణమిదేనా..!!

ABN, Publish Date - Aug 13 , 2024 | 07:55 PM

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. అధికారం చేపట్టేందుకు అధికార, విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరితోపాటు రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఆ క్రమంలో విపక్ష మహావికాస్ అఘాడి కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యేలా ఉన్నాయి.

Conflict Begins In MVA

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు (Maharashtra Assembly elections 2024) సమయం సమీపిస్తోంది. అధికారం చేపట్టేందుకు అధికార, విపక్షాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వీరితోపాటు రిజర్వేషన్ల అంశం ఉండనే ఉంది. ఆ క్రమంలో విపక్ష మహావికాస్ అఘాడి కూటమిలో కుమ్ములాటలు ప్రారంభమయ్యేలా ఉన్నాయి.



ఎందుకంటే..?

మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 145 సీట్లు గెలిచిన కూటమి అధికారం చేపడుతుంది. ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వ గడువు నవంబర్ 26వ తేదీతో ముగియనుంది. అక్టోబర్- నవంబర్ మధ్యలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఎంవీఏ కూటమిలో కాంగ్రెస్ పార్టీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) ఉన్నాయి. కూటమిలో ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చ మొదలైంది. శివసేన ఉద్దవ్ థాకరే పేరు తీసుకొచ్చింది. ఇప్పుడే వద్దని.. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రకటించొచ్చని కాంగ్రెస్ వాదిస్తోంది. అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని ఎన్సీపీ అభిప్రాయ పడింది.



థాకరే నేతృత్వంలో..!!

‘ఉద్దవే థాకరే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకెళతాం. మహారాష్ట్రలో ఎంవీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడనుంది. థాకరే-2 సర్కార్ ఏర్పడటం ఖాయం. ఈ సారి మమ్మల్ని ఆపడం ఎవరి తరం కాదు. అధికార పార్టీ డబ్బులు, మద్యం, సంక్షేమ పథకాలు అని ఎర వేస్తోంది. ప్రజలు ఓట్లు మాత్రం కూటమికే వేస్తారు అని’ శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ థాకరే ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెస్ ముఖ్య నేతలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో సీఎం అభ్యర్థిత్వంపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.



కాంగ్రెస్ వ్యతిరేకం

ముఖ్యమంత్రి అభ్యర్థితో ఎన్నికలకు వెళదాం అని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రతిపాదించగా కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ తిరస్కరించారు. ఎన్నికలు జరిగి, ఏ పార్టీ ఎక్కువ సీట్లు సాధిస్తే.. ఆ రాజకీయ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని స్పష్టం చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జీ రమేష్ చెన్నితల కూడా ఇదేవిధంగా స్పందించారు. కూటమి పేరుతో ప్రజల్లోకి వెళదామని స్పష్టం చేశారు. ఎన్సీపీ (ఎస్పీ) నేత జయంత్ ఆర్ పాటిల్ సీఎం అభ్యర్థితో ఎన్నికలకు వెళదామని సూచించారు.



Read More
National News
and Latest Telugu News

Updated Date - Aug 13 , 2024 | 07:55 PM

Advertising
Advertising
<