J&K Elections: పొత్తు ఓకే.. సీట్ల విషయంలో తెగని పంచాయితీ..
ABN, Publish Date - Aug 24 , 2024 | 06:18 PM
జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఒకటయ్యాయి. పొత్తు కుదిరినా సీట్ల పంచాయతీ ఇంకా తెగలేదు.
జమ్మూ కశ్మీర్‌లో శాసనసభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి దశ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ మొదలైంది. పార్టీల మధ్య పొత్తులు ఖరారయ్యాయి. జమ్మూకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) ఒకటయ్యాయి. పొత్తు కుదిరినా సీట్ల పంచాయతీ ఇంకా తెగలేదు. కాంగ్రెస్, ఎన్సీ పొత్తుపై ఎన్నో విమర్శలు వెలువడుతున్నాయి. పొత్తులు కుదిరాక బీజేపీ కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింది. 370 ఆర్టికల్ విషయంలో కాంగ్రెస్ వైఖరి స్పష్టం చేయాలని కమల నాధులు డిమాండ్ చేస్తున్నారు. 370 ఆర్టికల్‌ను పునరుద్దరించాలంటున్న పార్టీతో కాంగ్రెస్ ఎందుకు పొత్తు పెట్టుకుందంటూ బీజేపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి ఎవరనే విషయంలోనూ ఓ నిర్ణయానికి రాలేదు. ఎవరు ఎన్ని సీట్లలో పోటీచేస్తారనే దానికంటే ఏ స్థానంలో పోటీ చేయాలనేదానిపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తోంది. సీట్ల పంచాయితీ తేల్చే బాధ్యతను కాంగ్రెస్ సల్మాన్ ఖుర్షీద్‌కు అప్పగించింది.
Kolkata Doctor Case: కోల్‌కతా హత్యాచారం కేసులో ట్విస్ట్.. నా కొడుకు నిర్దోషి అంటున్న నిందితుడి తల్లి
రంగంలోకి ఖుర్షీద్..
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌సితో సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు సల్మాన్ ఖుర్షీద్‌ను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ భరత్ సింగ్ సోలంకీతో కలిసి ఫరూక్ అబ్దుల్లా కుటుంబంతో ఆయన సమస్యను పరిష్కరించనున్నారు. ఆ తర్వాత ఏయే సీట్లలో ఎవరు పోటీచేస్తారనేదానిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. మరోవైపు రెండు పార్టీలు సీఎం కుర్చీని ఆశిస్తున్నాయి. ముఖ్యమంత్రి పీఠం తమకు కావాలంటే తమకు కావాలంటున్నాయి. ఈక్రమంలో కాంగ్రెస్, ఎన్‌సి మధ్య ఉన్న సమస్యలను తెలుసుకుందాం.
Hyderabad: ముంబై-హైదరాబాద్.. మధ్యలోనే కుప్పకూలిన హెలికాప్టర్..
సీట్ల సంఖ్య విషయంలో..
జమ్మూ కాశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ స్థానాల్లో పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. కాశ్మీర్ లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ బలమైన ప్రాంతీయ పార్టీగా ఉంది. ప్రస్తుతం లోక్‌సభలో ఆ పార్టీకి 2 ఎంపీలు ఉండగా, కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో ఒకచోట గెలవలేదు. 2002, 2008, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ కంటే నేషనల్ కాన్ఫరెన్స్ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. మరోవైపు కాశ్మీర్ లోయ ప్రాంతంలో ఎక్కువ సీట్లు కావాలని కాంగ్రెస్ పట్టుబడుతోందిఈసారి జమ్మూ కాశ్మీర్‌లోని 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, వాటిలో 47 కాశ్మీర్ ప్రాంతంలో, 43 జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి.
Also Read: Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
సీఎం పీఠంపై..
కాంగ్రెస్, ఎన్‌సి కూటమి అధికారంలోకి వస్తే సీఎం ఏ పార్టీ నుంచి ఉంటారనే విషయంలో అధికారిక ప్రకటన వెలువడలేదు. 2008లో నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించే వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఒమర్ నిరాకరించారు. ఫరూఖ్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి సీఎం పదవి ఆశిస్తున్నారు. అయితే ఆయన వయసు 85 ఏళ్లు కావడంతో.. ఎన్‌సికి సీఎం పదవిని ఇస్తే ఎవరుంటారనేదానిపై ఇప్పటివరకు స్పష్టత మాత్రం లేదు. కాంగ్రెస్ మాత్రం ఎన్నికల తర్వాత సీఎం పదవిపై నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల ప్రాతిపదికన సీఎం పదవిని ఖరారు చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. కశ్మీర్‌లో 25 నుంచి 30 సీట్లు గెలిస్తే సీఎం పదవిని అడగవచ్చనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. సల్మాన్ ఖుర్షీద్‌తో భేటీ సందర్భంగా సీఎం పీఠంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ మధ్య హోరాహోరీ పోటీ సాగుతున్న స్థానాల్లో బనిహాల్, దురు, కకౌర్ స్థానాలు ప్రముఖమైనవి. వికాస్ రసూల్ బనీకి బనిహాల్ సీటు, గులాం అహ్మద్ మీర్‌కు దురు సీటు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.ఈ సీట్లను నేషనల్ కాన్ఫరెన్స్ కూడా ఆశిస్తోంది. ఈ సీట్లు కాంగ్రెస్ కు ఇస్తే స్థానికంగా తిరుగుబాటు తప్పదని ఒమర్ అబ్దుల్లా పార్టీ భావిస్తోంది. జమ్మూకశ్మీర్‌లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో సీట్ల పంపకాల విషయంలో ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ రెండు పార్టీల మధ్య కొన్ని సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరని పక్షంలో ఆ స్థానాల్లో రెండు పార్టీలు స్నేహపూర్వక పోటీచేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Uttar Pradesh: పీఎం మోదీ, సీఎం యోగిలను ప్రశంసించి భార్య.. ట్రిపుల్ తలాక్ చెప్పిన భర్త
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 24 , 2024 | 06:18 PM