Congress: కౌంటింగ్ రోజు రాత్రి ఢిల్లీలోనే ఉండండి... 'ఇండియా' బ్లాక్ నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం
ABN, Publish Date - Jun 03 , 2024 | 08:10 PM
'ఎగ్జిట్ పోల్' ఫలితాలను కొట్టిపారేసిన కాంగ్రెస్ పార్టీ ఈనెల 4న జరిగే ఓట్ల లెక్కింపుపై భారీ అంచనాలతో ఉంది. ఇందులో భాగంగా 'ఇండియా' కూటమి నేతలను ఆ పార్టీ అప్రమత్తం చేసింది. మంగళవారం రాత్రి కౌటింగ్ పూర్తయ్యేంత వరకూ లేదా బుధవారం ఉదయం 5 గంటల వరకూ అంతా ఢిల్లీలోనే ఉండాలని కూటమి సీనియర్ నేతలకు విజ్ఞప్తి చేసింది.
న్యూఢిల్లీ: 'ఎగ్జిట్ పోల్' (Exit poll) ఫలితాలను కొట్టిపారేసిన కాంగ్రెస్ (Congress) పార్టీ ఈనెల 4న జరిగే ఓట్ల లెక్కింపు (Counting)పై భారీ అంచనాలతో ఉంది. ఇందులో భాగంగా 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి నేతలను ఆ పార్టీ అప్రమత్తం చేసింది. మంగళవారం రాత్రి కౌటింగ్ పూర్తయ్యేంత వరకూ లేదా బుధవారం ఉదయం 5 గంటల వరకూ అంతా ఢిల్లీలోనే ఉండాలని కూటమి సీనియర్ నేతలకు విజ్ఞప్తి చేసింది. కౌటింగ్ అనంతరం వెలుపడే ఫలితాలను అనుగుణంగా కార్యచరణ ప్రణాళికను ఖరారు చేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం.
ఆప్షన్లు ఇవే..
ఎన్నికల ఫలితాలు వెలువడే క్రమంలో కూటమి నేతలు ఢిల్లీలోనే ఉండి సమావేశాలు, చర్చలు జరుపుతారని, అంచనాలకు తగినట్టుగా ఫలితాలు రాకుంటే తక్షణ కార్యాచరణపై చర్చిస్తారని తెలుస్తోంది. కార్యాచరణలో భాగంగా ప్రదర్శన (demonistration) నిర్వహించడం, ప్రెస్ కాన్ఫరెన్స్, రాష్ట్రపతిని కలవడం వంటివి ఉండొచ్చని సమాచారం. ఎన్నికల కమిషన్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తే అవకాశాలు కూడా లేకపోలేదని చెబుతున్నారు.
భారీ సన్నాహాలు
ఇండియా కూటమికి 295 పైగా సీట్లు వస్తాయని ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇందుకు తగ్గట్టుగా ఏఐసీసీ కార్యాలయాన్ని భారీగా ముస్తాబు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
Updated Date - Jun 03 , 2024 | 08:34 PM