Rahul Gandhi: పదేళ్ల గాయానికి ఓటుతో చికిత్స చేయండి.. ఓటర్లకు రాహుల్ గాంధీ పిలుపు..
ABN, Publish Date - Apr 19 , 2024 | 11:36 AM
ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయాలని, విద్వేషాలను ఓడించాలని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పిలుపునిచ్చారు. ఇందు కోసం దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరవాలని కోరారు.
ప్రజాస్వామ్యాన్ని పటిష్ఠం చేయాలని, విద్వేషాలను ఓడించాలని కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పిలుపునిచ్చారు. ఇందు కోసం దేశవ్యాప్తంగా ప్రేమ దుకాణాలు తెరవాలని కోరారు. దేశవ్యాప్తంగా మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా అవినీతి లేని స్వామ్య వ్యవస్థను నిర్మించేందు ఓటర్లందరూ ముందురు రావాలని అన్నారు. ఈ పదేళ్లలో దేశ ఆత్మపై జరిగిన గాయాలపై మీ ఓటుతో మందు పూయాలని చెప్పారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పేర్కొన్నారు. ఈరోజు మొదటి దశ ఓటింగ్!. మీ ప్రతి ఓటు భారతదేశ ప్రజాస్వామ్యాన్నే కాకుండా తరతరాల భవిష్యత్తును నిర్ణయిస్తుందని రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.
Surya Tilak: అయోధ్యలో జరిగిన సూర్య తిలకం వేడుక వెనుక ఇంత శాస్త్రీయత ఉందా?
మరోవైపు 2024 లోక్‌సభ ఎన్నికలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు మొదటి దశలో పోలింగ్ జరగుతోంది. పోటీలో ఉన్నవారిలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, శర్బానందా సోనోవాల్, భూపేంద్ర యాదవ్, కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్, డీఎంకెకు చెందిన కనిమొళి, బీజేపీకి చెందిన కే.అన్నామలై బరిలో ఉన్నారు.
PM Modi: కొత్త ఓటర్లకు మోదీ కీలక సందేశం
అరుణాచల్ ప్రదేశ్ (60 సీట్లు), సిక్కిం (32 సీట్లు) అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు 2014, 2019 ఎన్నికల్లో రివర్స్‌ను ఎదుర్కొని తిరిగి పుంజుకోవాలని ప్రతిపక్ష ఇండియా కూటమి ప్రణాళికలు రచిస్తోంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి.
Updated Date - Apr 19 , 2024 | 11:36 AM