ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Congress: ఎన్నికల వేళ ఖర్గే భారీ హామీ.. ఆ రంగంలో దేశాన్ని టాప్‌లో నిలుపుతామని స్పష్టీకరణ

ABN, Publish Date - May 11 , 2024 | 01:45 PM

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో దేశ జీడీపీ(GDP)లో తయారీ రంగ వాటాను 14 నుంచి 20 శాతానికి పెంచుతామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) తెలిపారు.

ఢిల్లీ: కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వచ్చే 5 ఏళ్లలో దేశ జీడీపీ(GDP)లో తయారీ రంగ వాటాను 14 నుంచి 20 శాతానికి పెంచుతామని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikharjun Kharge) తెలిపారు.

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఆయన ఎక్స్‌లో సుదీర్ఘ పోస్ట్ చేశారు.


"తయారీరంగ వాటాను పెంచి దేశాన్ని తయారీ రంగ హబ్‌గా మారుస్తాం. బీజేపీ కంటే కాంగ్రెస్ పాలనలోనే దేశ జీడీపీ ఎక్కువగా ఉండేది. దీనికి విరుద్ధంగా గత 10 ఏళ్లలో తయారీ రంగం వాటా కేవలం 14 శాతం వద్ద నిలిచిపోయింది. వస్తు సేవలను విరివిగా ఉత్పత్తి చేసే ఉత్పాదక శక్తి కేంద్రంగా దేశాన్ని మార్చాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. వ్యాపారాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పునరుద్ధరించడమే పార్టీ తక్షణ లక్ష్యం. ఉక్కు, లోహాలు, గార్మెంట్స్, టెక్స్‌టైల్స్, సిమెంట్, ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్, ఇంజినీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి బహుళ పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించి.. బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి" అని ఖర్గే పోస్ట్ చేశారు.

ఇదికూడా చదవండి: PM Modi: ఒడిశాలో మోదీ పర్యటన నేడు.. కీలక ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2024 | 01:45 PM

Advertising
Advertising