Statues Row: ఆ మహనీయుల విగ్రహాలను యథాస్థానంలోకి తీసుకురండి... ఖర్గే లేఖ
ABN , Publish Date - Jun 19 , 2024 | 08:00 PM
పార్లమెంటు ప్రాంగణంలోని మహనీయులు విగ్రహాలను వేరే చోటికి తరలించడంపై కాంగ్రెస్ భగ్గుమంది. మహాత్మాగాంధీ, శివాజీ, బీఆర్ అంబేద్కర్ తదితర మనీయుల విగ్రహాలను తిరిగి యథాతథ స్థానాల్లోకి తీసుకురావాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లకు లేఖ రాశారు.
న్యూఢిల్లీ: పార్లమెంటు (Parliament) ప్రాంగణంలోని మహనీయులు విగ్రహాలను (Statues) వేరే చోటికి తరలించడంపై కాంగ్రెస్ (Congress) భగ్గుమంది. మహాత్మాగాంధీ, శివాజీ, బీఆర్ అంబేద్కర్ తదితర మనీయుల విగ్రహాలను తిరిగి యథాతథ స్థానాల్లోకి తీసుకురావాలంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌లకు లేఖ (Letter) రాశారు. పార్లమెంటు కాంప్లెక్స్ వెనుక వైపు ఉన్న 'ప్రేరణా స్థల్' (Prena Sthal)కు ఈ విగ్రహాలను ఇటీవల తరలించారు. ఈ నిర్ణయాన్ని విపక్ష పార్టీలు విమర్శించడంతో పాటు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఖర్గే తాజా లేఖ రాశారు. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా విగ్రహాల తొలిగింపు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఉల్లంఘించడమే అవుతుందని అన్నారు. ఆ లేఖను సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో షేర్ చేశారు.
Gautam Adani: భారత్ అసాధారణ ప్రయాణం వెనుక మన్మోహన్, మోదీ... గౌతమ్ అదానీ ప్రశంసల జల్లు
కాగా, విగ్రహాల తరలింపు నిర్ణయంపై గత కొద్ది వారాలుగా రాజకీయ వివాదం కొనసాగుతోంది. బీజేపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోయినప్పటికీ దీనిపై లోక్‌సభ సెక్రటేరియట్ మాత్రం ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది. పార్లమెంటు కాంప్లెక్స్‌లో వివిధ లొకేషన్లలో విగ్రహాలు ఉండటం వల్ల సందర్శకులు వారి సమాచారం తెలుసుకోలేకున్నారని,అన్నీ ఒక చోటకు చేరిస్తే వారి చరిత్ర, సాధించిన విజయాలపై మెరుగైన సమాచారం తెలుసుకోగలని భావించి ప్రేరణా స్థల్‌కు వాటిని తరలించినట్టు తెలిపింది. కాగా, ఆదివారంనాడు ప్రేరణా స్థల్‌ను ప్రారంభించిన ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ మాట్లాడుతూ, ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ మహనీయుల నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతారని అన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్ ఓం బిర్లా సైతం రాబోయే తరాల వారికి కూడా ప్రేరణా స్థల్ ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Read Latest National News and Telugu News