Delhi Dust Storm: ఢిల్లీని కమ్మేసిన ఇసుక తుఫాను.. రెడ్ అలర్ట్, 15 విమానాలు రద్దు
ABN , Publish Date - Apr 11 , 2025 | 09:26 PM
ఇసుకు తుఫాను ముట్టడించడంతో సిటీలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ దట్టమైన మేఘాలు కమ్ముకుని చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్దిగంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది.

న్యూఢిల్లీ: వేసవి తాపంతో అల్లాడుతున్న ఢిల్లీని వరుసగా రెండోరోజైన శుక్రవారంనాడు కూడా బలమైన ఈదురు గాలులు, ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు చుట్టుముట్టాయి. ఇసుకు తుఫాను ముట్టడించడంతో సిటీలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ దట్టమైన మేఘాలు కమ్ముకుని చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే కొద్దిగంటలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేసింది. వాతావరణ ప్రతికూలత కారణంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 15 విమానాలను రాకపోకలను దారి మళ్లించారు.
Delhi MCD Elections: ఢిల్లీ ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలకు నోటిఫికేషన్
రాజధాని నగరంలోని మండి హౌస్, డిల్లీ గేట్ సహా పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో చెట్ట కొమ్మలు విరిగిపడ్డాయి. ఒక చెట్టు మొదలు విరిగిపడి మోటార్ వాహనం దెబ్బతినడంతో పాటు రోడ్లపై అడ్డంగా విరిగిపడిన చెట్ల కొమ్మలతో ట్రాఫిక్ అంతరాయాలు చోటుచేసుకున్నాయి.
రాబోయే మూడు గంటల్లో పెనుగాలులు, పిడుగులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇండ్ల నుంచి బయటకు రావద్దని, తప్పనిసరైన పక్షంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అప్రమత్తం చేసింది. పెనుతుఫాను తాకిడితో ప్లాంటేషన్లు, వ్యవసాయ ఉత్పత్తులు, స్టాండింగ్ క్రాప్‌కు నష్టం వాటిల్లవచ్చని, పశుగ్రాసం దెబ్బతినవచ్చని అంచనా వేస్తున్నారు.
గంటకు 80 కిలోమీటర్ల వేగంతో..
కాగా, ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో పెనుగాలుల వేగం 40 నుంచి 60 కిలోమీటర్లుగా ఉంటుందని, ఇది 80 కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇవి కూడా చదవండి..