Amit Shah Ambedkar Remarks Row: అమిత్‌షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ దేశవ్యాప్త నిరసన 24న
ABN, Publish Date - Dec 21 , 2024 | 05:09 PM
దేశంలోని అన్ని జిల్లాల్లోనూ 'బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్' నిర్వహించాలని కోరుతూ పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసీ వేణుగోపాల్ ఒక సర్క్యులర్ జారీ చేశారు.
న్యూఢిల్లీ: భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ (BR Ambedkar)పై కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. అమిత్‌షా వ్యాఖ్యలపై కొనసాగిస్తున్న నిరసనలను మరింత తీవ్రతరం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా డిసెంబర్ 24న దేశవ్యాప్తంగా ఆ పార్టీ నిరసనలను చేపట్టనుంది. అమిత్‌షా వ్యాఖ్యలపై పార్టీ ఎంపీలు, సెంట్రల్ వర్కింగ్ కమిటీ (CWC) సభ్యులు డిసెంబర్ 22, 23 తేదీల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
BMC elctions: బీఎంసీ ఎన్నికల్లో ఉద్ధవ్ శివసేన సోలో ఫైట్
దేశంలోని అన్ని జిల్లాల్లోనూ 'బాబాసాహెబ్ అంబేడ్కర్ సమ్మాన్ మార్చ్' నిర్వహించాలని కోరుతూ పార్టీ నేతలందరికీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కెసీ వేణుగోపాల్ ఒక సర్క్యులర్ జారీ చేశారు. అంబేద్కర్ విగ్రహాలకు పుష్పమాలలు వేసి మార్చ్ ప్రారంభించాలని, జిల్లా మెజిస్ట్రేట్లకు మెమొరాండం సమర్పించేంత వరకూ మార్చ్ కొనసాగించాలని ఆయన సూచించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లలో ఆయా నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, సీడబ్ల్యూసీ సభ్యులు పాల్గొంటారు.
పార్లమెంటులో రగడ
ఈనెల 20వ తేదీతో పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భాగంగా కేంద్ర మంత్రి అమిత్‌షా డిసెంబర్ 18న రాజ్యసభలో చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంబేద్కర్ పేరును పదేపదే ప్రస్తావించడం కాంగ్రెస్‌కు ఒక ఫ్యాషన్‌గా మారిందని షా విమర్శించారు. దేవుడి పేరు పదేపదే వల్లె వేస్తే స్వర్గమైనా దొరుకుతుందని అన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, అంబేద్కర్‌ను అమమానించినందుకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. పార్లమెంటు వెలుపల వినూత్న రీతిలో రోజువారీ నిరసనలకు దిగింది. ఈ క్రమంలోనే పార్లమెంటు ఆవరణలో ఎంపీల మధ్య బాహాబాహీ చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి, ముఖేష్ రాజ్‌పుత్‌లు గాయపడ్డారు. పార్లమెంటుకు వెళ్తుండగా తనను కూడా గెంటినట్టు మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఇరువర్గాల వారు పార్లమెంటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు నమోదు చేశారు.
ఇవి కూాడా చదవండి..
Bangalore: బెంగళూరులో అమెరికా రాయబారి కార్యాలయం..
Chief Minister: ప్రజాదరణ చూసి ఓర్వలేకే మాపై విమర్శలు.. దమ్ముంటే కేంద్రంపై మీ సత్తా ప్రదర్శించండి
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 21 , 2024 | 05:15 PM