PM Modi: కులమతాల పేరుతో దేశ ఐక్యతకు కాంగ్రెస్ విఘాతం
ABN, Publish Date - Oct 01 , 2024 | 05:18 PM
కాంగ్రెస్ పార్టీ రామమందిర నిర్మాణానికి అడ్డుపడిందని, జమ్మూకశ్మీర్‌లో సంపూర్ణంగా రాజ్యాంగాన్ని అమలు కానీయలేదని, అసెంబ్లీల్లో, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ పాటించలేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదని, కేవలం సొంత కుటుంబం కోసమే పనిచేసిందని మోదీ విమర్శించారు
పల్వల్: కులమతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ ఐక్యతను విచ్ఛినం చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాన నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల (Haryana Assembly Elctions) ప్రచారంలో భాగంగా పల్వల్‌లో మంగళవారం జరిగిన ర్యాలీలో ప్రధాని పాల్గొన్నారు. కుల రాజకీయాలు, అవినీతి, రిజర్వేషన్లతో సహా పలు ఆంశాలపై కాంగ్రెస్‌ను తప్పుపట్టారు.
''ఒక సామాన్య కార్యకర్తగా చాలాకాలంగా హర్యానా రాజకీయాలను ఆమూలాగ్రంగా నేను గమనించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను కలుసుకునే అవకాశం ఇటీవల నాకు కలిగింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఇదే నా చివరి ర్యాలీ. అయితే ఇది ఒక ప్రత్యేకమైన ర్యాలీగా ఎప్పటికీ గుర్తిండిపోయేలా మీరు చేశారు'' అని మోదీ అన్నారు.
Haryana Assembly Elections: మాజీ డిప్యూటీ సీఎం కాన్వాయ్‌పై దాడి
కాంగ్రెస్ పార్టీ రామమందిర నిర్మాణానికి అడ్డుపడిందని, జమ్మూకశ్మీర్‌లో సంపూర్ణంగా రాజ్యాంగాన్ని అమలు కానీయలేదని, అసెంబ్లీల్లో, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ పాటించలేదని, దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేదని, కేవలం సొంత కుటుంబం కోసమే పనిచేసిందని మోదీ విమర్శించారు. కాంగ్రెస్ ఎన్నో పాపాలు చేసినప్పటకీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే కలలు కంటోందని అన్నారు. కులతత్వాన్ని ప్రచారం చేస్తూ దేశభక్తిని అణగదొక్కాలని కాంగ్రెస్ చూస్తోందన్నారు. దేశభక్తుల ఐక్యతను దెబ్బతీయాలనుకుంటోందని ఆరోపించారు. హర్యానా ప్రజలు సమైక్యంగా నిలిచి అభివృద్ధికే ఓటు వేయాలని కోరారు. దేశాన్ని ప్రేమించే వారంతా ఐక్యంగా ఉంటామని హర్యానా ప్రజలు ప్రతిన పూనాలన్నారు.
Updated Date - Oct 01 , 2024 | 05:18 PM